ముంబ‌యిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదురుగు స్పాట్ డెడ్.. 12 మందికి తీవ్ర‌ గాయాలు

Published : Oct 05, 2022, 10:16 AM ISTUpdated : Oct 05, 2022, 10:25 AM IST
ముంబ‌యిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదురుగు స్పాట్ డెడ్.. 12 మందికి తీవ్ర‌ గాయాలు

సారాంశం

Bandra-Worli Crash: ముంబ‌యిలోని బాంద్రా-వర్లీ సీ లింక్ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘ‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 12 మంది గాయ‌ప‌డ్డారు.   

Mumbai road accident: దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. 

ఈ ప్ర‌మాదం గురించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. ముంబ‌యిలోని బాంద్రా-వర్లీ సముద్ర లింక్‌పై వేగంగా వెళ్తున్న ఆగివున్న మూడు వాహ‌నాలు, అక్క‌డి జ‌నాల‌పైకి దూసుకెళ్లింది. బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అంబులెన్స్‌తో పాటు ఇతర వాహనాలను రోడ్డు పక్కన నిలిపి ఉంచి, అంతకుముందు ప్రమాదానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని బాంద్రాలో వర్లీ లేన్‌కు తీసుకెళ్లేందుకు వైద్య బృందం సిద్ధమవుతుండగా, ఒక హైస్పీడ్ కారు వేగంగా వ‌చ్చి వాహనాలను ఢీకొట్టింది, ఫలితంగా ఐదుగురు వ్యక్తులు మరణించారు.

ఈ ప్ర‌మాద దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన CCTV ఫుటేజీలో.. ఒక అంబులెన్స్, మూడు కార్లు వంతెనపై నిలబడి ఉండగా, అధిక వేగంతో వచ్చిన వాహనం వాటిని ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో పలువురు ఘటనా స్థలంలో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అలాగే, అధికారులు బాంద్రా నుంచి వర్లీకి వెళ్లే రహదారిని మూసివేశారు. 

ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. "ముంబ‌యిలోని బాంద్రా-వర్లీ సీ లింక్‌పై జరిగిన ప్రమాదంలో ప‌లువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని ప్ర‌ధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్ చేసింది. 

 

ఉత్త‌రాఖండ్ లో లోయ‌లో ప‌డ్డ బస్సు.. 

ఉత్తరాఖండ్ లోని లాల్‌ధాంగ్‌లోని కటేవాడ్ గ్రామం నుండి హరిద్వార్ జిల్లాలోని కంద తల్లాకు వెళ్తున్న బస్సు లాన్స్‌డౌన్‌లోని సిమ్డి గ్రామం సమీపంలో మూడున్నర వందల మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 25 మందికి పైగా మరణించారు. పోలీసులు తెలిపిన తాజా సమాచారం ప్రకారం.. రాత్రి సమయంలో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 21 మందిని రక్షించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రుల్లో చేరిన వారు.

బస్సులో దాదాపు 45 మంది.. 

ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికితీశారు. బస్సులో దాదాపు 45 మంది ఉన్నారు. పట్టీ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయిందని చెబుతున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగిన సంఘటన గురించి చెబుతున్నారు. SDRF, గ్రామస్తుల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్