నా పిల్లలను అబ్రాడ్‌లోనే సెటిల్ కావాలని చెప్పా.. ఇక్కడి పరిస్థితులు బాగాలేవు: ఆర్జేడీ నేత

By Mahesh KFirst Published Dec 23, 2022, 4:49 PM IST
Highlights

‘మన దేశంలో పరిస్థితులు బాగాలేవు. అందుకే నా పిల్లలను అబ్రాడ్‌లోనే ఉద్యోగులు చూసుకుని అక్కడే సెటిల్ కావాలని సూచించాన’ని బిహార్‌కు చెందిన ఆర్జేడీ నేత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 

పాట్నా: బిహార్‌లో అధికార పార్టీ ఆర్జేడీ సీనియర్ లీడర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పిల్లలను అబ్రాడ్‌లోనే జాబ్‌లు చేసుకుంటూ అక్కడే సెటిల్ కావాలని సూచించా అని కామెంట్ చేశారు. ఇక్కడ పరిస్థితులు బాగా లేవని వివరించా అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లోనూ చక్కర్లు కొడుతున్నాయి.

ఆర్జేడీ జాతీయ జనరల్ సెక్రెటరీ అబ్దుల్ బారీ సిద్దిఖీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి నేను నా వ్యక్తిగత ఉదాహరణ ఒకటి ఇస్తాను. నా కొడుకు హార్వర్డ్‌లో చదువుతున్నాడు. నా బిడ్డ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ నుంచి డిగ్రీ పంట్టా పొందింది. వారిద్దరిద్దరికీ అబ్రాడ్‌లోనే జాబ్‌లు వెతుక్కోవాలని చెప్పాను. వీలైతే అక్కడే పౌరసత్వం తీసుకోవాలని కూడా సూచించాను’ అని వివరించారు. గత వారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘నా సూచనలతో పిల్లలు ఖంగుతిన్నారు. నమ్మలేకపోయారు. నేను ఇండియాలోనే జీవిస్తున్నా కదా అని పాయింట్ ఔట్ చేశారు. కానీ, మీరు ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేరని చెప్పాను’ అని చెప్పినట్టు వివరించారు.

Also Read: నా పాత నెంబర్ ఇంకా పని చేస్తోంది.. కోవిడ్ సాయం కోసం కాల్ చేయొచ్చు - సోనూ సూద్

ఆర్జేడీ లీడర్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ.. ఇందులో ముస్లింలు గానీ, బీజేపీ ప్రభుత్వం పేరు గానీ తీయలేదు. కానీ, ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ కావడంతో బీజేపీ బిహార్ యూనిట్ ఫైర్ అయింది. ఆ నేతను పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని పేర్కొంది.

సిద్దికీ చేసిన వ్యాఖ్యలు భారత దేశానికి వ్యతిరేకమైనవని, ఆయన ఒక వేళ ఇక్కడ భయపడుతూ బతుకుతున్నాడనుకుంటే అతను అనుభవిస్తున్న సౌలభ్యాలు అన్నీ వదిలి పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని పేర్కొంది. ఆయనను ఎవరూ ఆపరు అని రాష్ట్ర బీజేపీ ప్రతినిధి నిఖిల్ ఆనంద్ తెలిపారు. 

ఆర్జేడీ లీడర్ లాలు ప్రసాద్ యాదవ్‌కు అబ్దుల్ బారీ సిద్దిఖీ సన్నిహితంగా ఉండే నేత కావడం గమనార్హం.

click me!