
RJ Sayema supports Swara Bhaskar's marriage: ప్రముఖ నటి, బోల్డ్ బ్యూటీ స్వరభాస్కర్ చాలా బాలీవుడ్ చిత్రాలతో నటించి బాగా పాపులర్ అయింది. బోల్డ్ రోల్స్ లో నటిస్తూ అందరిని ఆకర్షించింది. అలాగే స్వర భాస్కర్ సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ పై కూడా తరచుగా ట్రోలింగ్ జరుగుతూ వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో తరచు ఆమె పేరు వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. స్వరాభాస్కర్ వివాహం చేసుకున్నారు. తాను ప్రేమించిన వ్యక్తి, ముంబయికి చెందిన రాజకీయ నాయకుడు ఫహద్ అహ్మద్‌ను ఆమె వివాహం చేసుకున్నారు ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె ప్రకటన చేసిన వెంటనే ఈ న్యూస్ తెగ వైరల్ అయింది.
స్వరాభాస్కర్ వివాహానికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పలువురు ఈ వివాహంపై భిన్న రకాల కామెంట్లు చేశారు. వేరే మతానికి చెందిన వ్యక్తి వివాహం చేకున్నదనీ, ఈ వివాహం చెల్లదని కూడా పలువురు కామెంట్లు చేశారు. ఇదే క్రమంలోనే ఆమెపై ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. అయితే, సమాజ్ వాదీ పార్టీ నేత ఫహద్ జిరార్ అహ్మద్ తో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ వివాహంపై ప్రముఖ రేడియో హోస్ట్, యాక్టివిస్ట్ ఆర్జే సయీమా స్పందించారు. ఆమెకు మద్దతుగా నలిచారు.
తనూ వెడ్స్ మను రిటర్న్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి పాపులర్ హిందీ చిత్రాల్లో అవార్డ్ విన్నింగ్ పాత్రలు పోషించిన ప్రముఖ భారతీయ నటి స్వర భాస్కర్. ఆమె రెండు స్క్రీన్ అవార్డులను సైతం గెలుచుకున్నారు. అలాగే, మూడు సార్లు ఫిల్మ్ ఫేర్ కు నామినేట్ అయ్యారు. ఫహద్ జిరార్ ను పెళ్లి చేసుకున్నట్లు స్వర భాస్కర్ ట్విటర్ లో ప్రకటించగా ఆ పోస్ట్ వెంటనే వైరల్ అయింది.
అయితే, ఇద్దరు వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో ఈ వివాహం చెల్లదని చికాగోకు చెందిన మ్యాగజైన్ ఎడిటర్, స్కాలర్ డాక్టర్ యాసిర్ నదీమ్ అల్ వాజిదీ పేర్కొన్నారు.
అయితే, ఆర్జే సయీమా.. యాసిర్ నదీమ్ అల్ వాజిదీకి కౌంటర్ ఇస్తూ, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న స్వర నిర్ణయాన్ని సమర్థిస్తూ ట్వీట్లు చేశారు. సయిమా ట్వీట్లకు నెటిజన్ల నుంచి కూడా మద్దతు లభించింది. మత పండితులు ప్రజల వ్యక్తిగత విషయాలపై తీర్పు ఇవ్వరాదని వారు పేర్కొన్నారు. మతాంతర వివాహానికి బాహాటంగా మద్దతు తెలిపిన సయీమాను పలువురు ట్విట్టర్ యూజర్లు అభినందించారు.
మతాంతర వివాహాలు ఇప్పటికీ అనుమానాస్పదంగా, శత్రుత్వాన్ని ఎదుర్కొంటున్న భారత్ లో సయీమా చర్యలు యథాతథ స్థితిని సవాలు చేయడానికి-సరైన మార్గం కోసం నిలబడటానికి సంసిద్ధతను ప్రదర్శిస్తాయని చెప్పవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.