హిడెన్ బర్గ్‌ నివేదిక: కేంద్రం సూచించిన కమిటీకి సుప్రీం నిరాకరణ

Published : Feb 17, 2023, 04:30 PM ISTUpdated : Feb 17, 2023, 04:45 PM IST
హిడెన్ బర్గ్‌ నివేదిక: కేంద్రం  సూచించిన కమిటీకి సుప్రీం నిరాకరణ

సారాంశం

అదానీ- హిడెన్ బర్గ్  వ్యవహరంపై  కేంద్రం  సూచించిన  కమిటీని  సుప్రీంకోర్టు   తిరస్కరించింది.  

న్యూఢిల్లీ:  అదానీ- హిడెన్ బర్గ్ వ్యవహరంపై  కేంద్రం   సీల్డ్  కవర్లో  సూచించిన   నిపుణుల కమిటీని  సుప్రీంకోర్టు తిరస్కరించింది.  సీల్డ్ కవర్లో  నిపుణుల కమిటీని  శుక్రవారం నాడు కేంద్రం  అందించింది.  కేంద్రం  సూచించిన  కమిటీ సభ్యులను అంగీకరించబోమని  జస్టిస్  చంద్రచూడ్  ధర్మాసనం  తెలిపింది. అదానీ  షేర్ల పతనానికి  కారణమైన హెడెన్ బర్గ్ నివేదికను  పరిశీలించాలని  కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. డిపాజిట్ దారులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా  ఉండేందుకు కమిటీని నియమించాలని  సుప్రీంకోర్టు  కేంద్రాన్ని ఆదేశించింది.  

పెట్టుబడిదారుల  ప్రయోజనాలకు విసయంలో  పూర్తి పారదర్శకతను  కొనసాగించాలని  కోరుకుంటున్నట్టుగా  సుప్రీంకోర్టు తెలిపింది.  ఈ  విషయమై  తాము పూర్తి పారదర్శకతను  కొనసాగించాలనుకుంటున్నందున మీ సీల్డ్  కవర్  సూచనలను అంగీకరించబోమని  సుప్రీంకోర్టు  ధర్మాసనం  స్పష్టం  చేసింది. 

  ఈ నెల  10వ తేదీన  నిపుణుల కమిటీని  ఏర్పాటు  చేసే విషయాన్ని పరిశీలించాలని  కేంద్రాన్ని  సుప్రీంకోర్టు  కోరిన విషయం తెలిసిందే. అదానీ- హిడెన్ బర్గ్  నివేదిక  అంశానికి సంబంధించి  సుప్రీంకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి.  న్యాయవాదులు  విశాల్ తివారీ,  ఎంఎల్ శర్మ,  కాంగ్రెస్ నేత  జయ ఠాకూర్,   , ముకేష్ కుమార్  లు సుప్రీంకోర్టులో  పిటిషన్లు దాఖలు  చేశారు. 
 

 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?