ఎండల నుంచి తన కష్టమర్లను రక్షించేందుకు ఓ రిక్షా వాలా విన్నూత్నంగా ఆలోచించాడు. తన రిక్షాను మొత్తం ఓ మినీ గార్డెల్ లా మార్చేశాడు. అతడి ఆవిష్కరణకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎండాకాలం వచ్చేసింది. రోజు రోజుకు ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో ఎవరూ దాదాపుగా బయటకు రావడం లేదు. కానీ అత్యవస పనుల మీద, ఉద్యోగ అవసరాల నిమిత్తం బయట తిరిగే వారు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఎండల వల్ల బయట తిరిగే వారు ఆటో రిక్షాలకు ప్రియారిటీ ఇవ్వడం లేదు. ఎక్కువ మంది ఏసీ క్యాబ్ లను బుక్ చేసుకొని వెళ్తున్నారు. అయితే దీనిని అధిగమించేందుకు, కష్టమర్లను ఆహ్వానించేందుకు ఓ ఆటో రిక్షా వాలా విన్నూత్నంగా ఆలోచించాడు. తన రిక్షాలో ప్రయాణించే వారికి ఎలాగైనా చల్లదనం కల్పించాలనే ఉద్దేశంతో ఒక కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అతడి ఆవిష్కరణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఇంతకీ ఏంటా ఆవిష్కరణ అంటే..?
This Indian 🇮🇳 man grew grass on his rickshaw to stay cool even in the heat. Pretty cool indeed! pic.twitter.com/YnjLdh2rX2
— Erik Solheim (@ErikSolheim)ఓ రిక్షా వాలా తన రిక్షాను ఓ మినీ గార్డెన్ గా మార్చేశాడు. తన రిక్షాలో ప్రయాణించే వారికి ఎండ నుంచి ఉపశమనం కల్గించేందుకు దీనిని రూపొందించాడు. రిక్షా టాప్ పైనా మొత్తం గడ్డి పెంచారు. రిక్షాకు ఇరు పక్కల పూల కుండీలు పెట్టి, వాటి తీగలను పైకి ఎగబాకేలా చేశాడు. ఇలా మొత్తం రిక్షాను గ్రీనరీగా మార్చేశారు. ఇందులో ప్రయాణించే వారికి ప్రకృతిలో సేదదీరినట్టుగా అనిపిస్తోంది. ఇందులో కూర్చున్నంత సేపు వారు ఎంతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు.
undefined
ఈ విన్నూత్న ఆవిష్కరణను యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హీమ్ దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఈ రిక్షా ఫొటోను ఆయన ట్విట్లర్ లో షేర్ చేశారు. ఈ ఫొటోలో రిక్షా నడిపే వ్యక్తి ఓ గార్డెల్ కూర్చున్నట్టు కనిపిస్తోంది. “ ఈ భారతీయుడు ఎండలో కూడా చల్లగా ఉండేందుకు తన రిక్షా మీద గడ్డిని పెంచాడు. నిజంగా చాలా బాగుంది! ” అని ఎరిక్ సోల్హీమ్ ట్విట్లర్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఆ రిక్షా వాలా ఆలోచనను అందరూ పొగుడుతున్నారు. అతడి ఆవిష్కరణను మెచ్చుకుంటున్నారు.
ఈ ట్వీట్ కు 20,000 కంటే ఎక్కువ లైక్‌లు, 2000 కంటే ఎక్కువ రీట్వీట్‌లతో దూసుకుపోతోంది. రిక్షా డ్రైవర్ సృజనాత్మకతకు నెటిజన్లు ముగ్ధులవుతున్నారు. అతడి ఆవిష్కరణకు ఫిదా అవుతూ ఓ వ్యక్తి ఇలా రాశారు.. ‘‘ ఈ వేడి వేసవిలో చల్లగా ఉండటానికి ఒక కొత్త ఆలోచన. ఇలా కొత్తగా ఆలోచించినందుకు అతడిని అభినందించండి.. ఇది కస్టమర్లను ఆకర్షించడానికి ఒక మంచి మార్గం. ’’ అని పేర్కొన్నారు. మరో వ్యక్తి ‘‘ ఇది వాస్తవానికి చాలా వినూత్నమైనది, ఇతర రిక్షా డ్రైవర్లు కూడా దీనిని అనుసరించాలి. ఇది ఏప్రిల్ నెల. ఉష్ణోగ్రత ఇప్పటికే 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది.’’ అని అన్నారు