వివాదంలో చిక్కిన బాలీవుడ్ నటి రిచా చద్దా.. ఆర్మీకి క్షమాపణలు !

By Rajesh KarampooriFirst Published Nov 24, 2022, 4:18 PM IST
Highlights

గాల్వాన్ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన ట్వీట్‌ దుమారం సృష్టించింది. వెంటనే తన ట్వీట్‌ను తొలగించి క్షమాపణలు చెప్పింది. సైన్యాన్ని అవమానించాలన్నా, ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని రిచా చద్దా తెలిపారు. భారత జవాన్ల త్యాగాలను తక్కువ చేసేదిలా ఉందంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 

గాల్వాన్‌ ఘటనపై  బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన ట్వీట్ ట్విట్టర్‌లో పెద్ద దుమారాన్ని రేపింది. ఆమెపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో బాలీవుడ్ నటి వెంటనే తన వివాదాస్పద ట్వీట్‌కు క్షమాపణలు చెప్పింది. తాను ఉద్దేశపూర్వకంగా ట్వీట్ చేయలేదని, తన ఉద్దేశ్యం వేరేననీ, ఎవ్వరిని నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పింది. తన ట్విట్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే క్షమాపణలు కోరుతున్నానని ట్విట్ చేసింది. 
  
రిచా చద్దా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో ఇలా రాసింది. 'నా ఉద్దేశ్యం ఎవరినీ కించపరచడం కాదు. నేను చెప్పిన మూడు మాటల వల్ల నన్ను వివాదంలోకి లాగారు. తెలిసి లేదా తెలియక నా మాటల వల్ల నా సైనిక సోదరుల మనోభావాలు గాయపడినా లేదా గాయపడినా..క్షమాపణలు కోరుతున్నాను. దీనితో పాటు..మా అమ్మానాన్న కూడా సైన్యంలో పని చేసినట్టు నేను చెప్పాలనుకుంటున్నాను. నా మామ ఒక పారాట్రూపర్. దేశభక్తి నా రక్తంలోనే ఉంది. దేశాన్ని రక్షించే క్రమంలో కొడుకు చనిపోతే ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోతుంది. ఒక సైనికుడు గాయపడితే దాని ప్రభావం నాకు బాగా తెలుసు. ఇది నాకు భావోద్వేగ సమస్య కూడా. అని పేర్కొంది. 

ఇండియన్ ఆర్మీని అవమానిస్తూ.. అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో రిచా ట్రోల్ చేయబడింది. ఆమె ట్వీట్‌ను అనుసరించి.. పలువురు నాయకులు, సోషల్ మీడియా వినియోగదారులు నటుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొందరు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని ముంబై పోలీసులను కోరారు. చాలా మంది  అవమానకరం అంటూ పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

pic.twitter.com/EYHeS75AjS

— RichaChadha (@RichaChadha)

థర్డ్ గ్రేడ్ నటిపై  చర్య తీసుకోవాలని డిమాండ్ 
 
రిచా చద్దా ట్వీట్‌ను 'అభ్యంతరకరం','అవమానకరం' అని పిలుస్తూ.. ఆ ట్వీట్ ను బిజెపి నాయకుడు మంజీందర్ సింగ్ దానిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఒక వీడియోను పంచుకుంటూ.. రిచా చద్దాను 'థర్డ్ గ్రేడ్ నటి' అని వర్ణించారు. ఆమెపై ముంబై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

రిచాపై సుప్రీంకోర్టు న్యాయవాది ఫిర్యాదు

అదే సమయంలో రిచా చద్దాపై చర్యలు తీసుకోవాలని శివసేన అధికార ప్రతినిధి ఆనంద్ దూబే డిమాండ్ చేశారు. మరోవైపు నటి ట్వీట్‌పై సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో రిచా చద్దాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే.. ఈ దుమారం తరువాత.. రిచా తన ట్వీట్‌ను తొలగించడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పింది.

రచ్చ ఎక్కడ మొదలైంది?

ఉత్తర ఆర్మీ కమాండర్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల నవంబర్ 22న ఒక ప్రకటనలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దేనికైనా సిద్ధమని చెప్పడంతో సమస్య మొదలైంది. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే దానికి భారత్ తగిన సమాధానం చెబుతుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై కూడా ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుమతి ఇస్తే దాన్ని వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆ ప్రక‌ట‌న‌పై రిచా స్పందిస్తూ.. ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ కామెంట్ చేసింది. ఆ వ్యాఖ్యల‌పై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో నటి దిగొచ్చి క్షమాపణలు చెప్పింది. 2020లో గాల్వన్ వ్యాలీలో భారత్, చైనాల మధ్య చాలా ఘర్షణలు జరిగాయి, ఇందులో దేశంలోని 20 మంది సైనికులు వీరమరణం పొందారు.

click me!