పది మంది భార్యలు.. ఒక్కో నగరంలో ఒక్కొక్కరిని ఉంచి..

Published : Sep 11, 2021, 09:08 AM ISTUpdated : Sep 11, 2021, 09:15 AM IST
పది మంది భార్యలు.. ఒక్కో నగరంలో ఒక్కొక్కరిని ఉంచి..

సారాంశం

అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇర్ఫాన్‌కు మొత్తం పది మంది భార్యలు. వారిని వివిధ నగరాల్లో ఉంచాడు. తాజాగా ఓ భార్య పేరు మీద అత్యంత ఖరీదైన జాగ్వర్ కారు కొన్నాడు. 

అతనికి ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పది మంది భార్యలు ఉన్నారు. ఒక్కో భార్యను ఒక్కో నగరంలో ఉంచాడు.  ఒక భార్య నుంచి మరో భార్య దగ్గరకు వెళ్లాలంటే విమానాల్లో మాత్రమే ప్రయాణిస్తాడు. అయితే..  అతను ఓ పెద్ద బిజినెస్ మెన్ అయ్యి ఉంటాడని పొరపాటు పడేరు. అస్సలు కాదు. అతను కేవలం ఓ గజ దొంగ కావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే..  అతడి పేరు ఇర్ఫాన్. మరో ముగ్గురి సహాయంతో అతను భారీ దోపిడీలు చేస్తుంటాడు. అతడి మీద వివిధ రాష్ట్రాలలో డజనుకు పైగా కేసులున్నాయి. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇర్ఫాన్‌కు మొత్తం పది మంది భార్యలు. వారిని వివిధ నగరాల్లో ఉంచాడు. తాజాగా ఓ భార్య పేరు మీద అత్యంత ఖరీదైన జాగ్వర్ కారు కొన్నాడు. 

ఆ కారులోనే వెళ్లి తాజాగా కవినగర్‌కు చెందిన స్టీలు వ్యాపారవేత్త కపిల్ గార్గ్ నుంచి కోటి రూపాయలు కొట్టేశాడు. కపిల్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ఇర్ఫాన్ భార్య గుల్షన్, అతడి డ్రైవర్ మహ్మద్ షోయబ్‌ను అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి గురించి పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌