కరోనా భయం: రిటైర్డ్ తహసీల్దార్ సోమానాయక్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య

Published : May 10, 2021, 08:38 PM ISTUpdated : May 10, 2021, 08:44 PM IST
కరోనా భయం:  రిటైర్డ్ తహసీల్దార్ సోమానాయక్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య

సారాంశం

కర్ణాటకలో రిటైర్డ్  తహసీల్దార్  సోమానాయక్ కరోనా భయంతో  సోమవారం నాడు  ఆత్మహత్య చేసుకొన్నాడు.  

బెంగుళూరు: కర్ణాటకలో రిటైర్డ్  తహసీల్దార్  సోమానాయక్ కరోనా భయంతో  సోమవారం నాడు  ఆత్మహత్య చేసుకొన్నాడు.  సోమానాయక్ కు కరోనా సోకింది. దీంతో తన  కుటుంబసభ్యులకు కూడ కరోనా సోకుతోందనే భయంతో ఆయన ఇవాళ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య  చేసుకొన్నాడు.  తన ఫామ్‌హౌస్‌కు కారులో వెళ్లిన సోమానాయక్ కారులోనే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. 

కరోనా సోకితే వైద్య చికిత్స తీసుకొంటే వ్యాధి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే  ఈ వ్యాధి నుండి కోలుకోలేమోననే  భయంతో  ఆత్మహత్యలకు పాల్పడవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యదికంగా కరోనా కేసులు నమోదౌతున్న రాష్ట్రాల్లో కర్ణాటక రాష్ట్రం కూడ ఒకటి.  రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. బెంగుళూరు సిటీలోనే అత్యధికంగా కరోనా  కేసులు రికార్డు అవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం