6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు.. కీలక అంశాలు

Published : Nov 06, 2022, 12:32 PM IST
6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు..  కీలక అంశాలు

సారాంశం

by-elections: తెలంగాణలోని మునుగోడు, బీహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్ నియోజకవర్గాలు, హర్యానాలోని అదంపూర్, ఒడిశాలోని ధామ్‌నగర్, మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు), ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోకరనాథ్ నియోజకవర్గాల్లో నవంబర్ 3న పోలింగ్ జ‌రిగింది.

by-elections results: తెలంగాణ, బీహార్, హర్యానా వంటి ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. తెలంగాణలోని మునుగోడు,  బీహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్ నియోజకవర్గాలు, హర్యానాలోని అదంపూర్, ఒడిశాలోని ధామ్‌నగర్, మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు), ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోకరనాథ్ నియోజకవర్గాల్లో నవంబర్ 3న పోలింగ్ జ‌రిగింది.  తాజా వివరాలు ఇలా ఉన్నాయి.. 

తెలంగాణ‌

తొలి ట్రెండ్ నుంచి తెలంగాణలోని మునుగోడులో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 77.55 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేర‌డంతో తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 47 మంది అభ్యర్థులు బరిలో ఉండగా బీజేపీ నుంచి రాజ్‌గోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్ర‌ధాన పోటీదారులుగా ఉన్నారు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ ఇక్క‌డ లీడ్ లో ఉంది. 

బీహార్

మొకామా అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీకి చెందిన నీలం దేవి 35,056 ఓట్లతో ముందంజలో ఉన్నట్లు తొలి ట్రెండ్‌లు చెబుతున్నాయి. మరోవైపు గోపాల్‌గంజ్‌ అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి మోహన్‌ ప్రసాద్‌ గుప్తా ఆధిక్యంలో ఉన్నారు. గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో 48.35 శాతం ఓటింగ్ నమోదు కాగా, బీహార్‌లోని మొకామాలో 52.47 శాతం నమోదైంది. ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ బీజేపీతో విడిపోయి ఆర్జేడీలో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటే చేసిన త‌ర్వాత జ‌రుగుతున్న మొద‌టి ఎన్నిక‌లు ఇవి. మొకామా ఉపఎన్నికలకు, ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవిపై సోనమ్ దేవిని బీజేపీ నిలబెట్టింది. ఆమె భర్త అనంత్ సింగ్‌పై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గోపాల్‌గంజ్ ఉప ఎన్నికలో మోహన్ ప్రసాద్ గుప్తాను ఆర్జేడీ రంగంలోకి దించగా, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ భార్య కుసుమ్ దేవికి బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. గోపాల్ గంజ్ లో బీజేపీ స్వ‌ల్ప లీడ్ లో ఉంది. బీజేపీ-ఆర్జేడీల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. మొకామాలో ఆర్జేడీ గెలుపు దిశ‌గా ఉందుకు సాగుతోంది. 

హర్యానా

ప్రారంభ ట్రెండ్స్ ప్రకారం మొదటి రౌండ్ కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ 2846 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హర్యానాలోని అడంపూర్ నియోజకవర్గంలో 75.25 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రధాన పోటీ దారులుగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ కుమారుడు కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆగస్టులో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి మారడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బిష్ణోయ్ కుమారుడు భవ్య పోటీకి దిగారు. బీజేపీ భారీ అధిక్యంలో ఉంది. 

ఒడిషా

ఒడిశాలోని ధామ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో 66.63 శాతం ఓటింగ్ నమోదైంది. అధికార బీజేపీడీ అభ్యర్థి అబంతి దాస్, బీజేపీ అభ్యర్థి బిష్ణు సేథీ కుమారుడు, BJP అభ్యర్థి సూర్యబన్షి సూరజ్ ల మ‌ధ్య పోటీ నెల‌కొంది. బీజేపీ లీడ్ లో ఉంది. 

మహారాష్ట్ర

మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు) అసెంబ్లీ స్థానంలో శివసేనకు చెందిన ఉద్ధవ్ థాకరే వర్గం అభ్యర్థి రుతుజా లట్కే ఇప్పటి వరకు మొత్తం 24,955 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రుతుజా లట్కే ప్రస్తుత సేన ఎమ్మెల్యే రమేష్ లట్కే భార్య. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గంలో అత్యల్పంగా 31.74 శాతం ఓటింగ్ నమోదైంది. ఉద్ధవ్ థాకరే వర్గం అభ్య‌ర్థి గెలుపు ఖాయంగా ముందుకు సాగుతోంది. 

ఉత్తర ప్రదేశ్

గోల గోకరానాథ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి 110592 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోల గోకరానాథ్ నియోజకవర్గంలో 55.68 శాతం పోలింగ్ నమోదైంది. సెప్టెంబరులో బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ గిరి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ అభ్యర్థి అమన్‌గిరి, ఎస్పీ అభ్యర్థి, గోల గోకరనాథ్‌ మాజీ ఎమ్మెల్యే వినయ్‌ తివారీ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం బీజేపీ ముంద‌జ‌లో ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం