సెల్ఫీ పిచ్చికి 259 మంది బలి

By Nagaraju TFirst Published Oct 4, 2018, 7:13 PM IST
Highlights

ఒకప్పుడు ఫోటో తీసుకోవడం అంటే గగనం. అలాంటిది సెల్ ఫోన్ వచ్చిందో లేదో ఎక్కడకు వెళ్లినా ఓ ఫోటో కొట్టడం ఎక్కడకు వెళ్లామో సోషల్ మీడియాలో మిత్రులకు షేర్ చెయ్యడం..ఆ ఫోటో తియ్యాలన్నా వేరొకర్ని బతిమిలాడాల్సిన పరిస్థితి. అయితే ఆ సమస్యలు లేకుండా సెల్పీ రావడంతో ఇప్పుడు అదే ఒక ట్రెండ్ అయిపోయింది. ఎక్కడకు వెళ్లినా ఎవరిని కలిసినా సెల్ఫీలే సెల్ఫీలు.

ఢిల్లీ: ఒకప్పుడు ఫోటో తీసుకోవడం అంటే గగనం. అలాంటిది సెల్ ఫోన్ వచ్చిందో లేదో ఎక్కడకు వెళ్లినా ఓ ఫోటో కొట్టడం ఎక్కడకు వెళ్లామో సోషల్ మీడియాలో మిత్రులకు షేర్ చెయ్యడం..ఆ ఫోటో తియ్యాలన్నా వేరొకర్ని బతిమిలాడాల్సిన పరిస్థితి. 

అయితే ఆ సమస్యలు లేకుండా సెల్పీ రావడంతో ఇప్పుడు అదే ఒక ట్రెండ్ అయిపోయింది. ఎక్కడకు వెళ్లినా ఎవరిని కలిసినా సెల్ఫీలే సెల్ఫీలు. ఆఖరుకు ఆత్మహత్య కూడా సెల్పీ వీడియోలో షూట్ చేసి మరీ చనిపోతున్నారు. 

సోషల్ మీడియాలో తాము చేసిన విహారయాత్రలను కానీ కలుసుకున్న ప్రముఖులను కానీ మిత్రులతో షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో సెల్ఫీలు పెట్టడం సరదాగా అయ్యింది. అయితే అదే సెల్ఫీ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటుంది. ప్రాణాంతకమైన ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుంటూ దాదాపుగా 259మంది ప్రాణాలు కోల్పోయారు. 

అక్టోబర్ 2011 నుంచి నవంబర్ 2017 వరకు సెల్ఫీల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 259మంది పైనేనని తెలిపింది. ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నివేదిక ప్రకారం సెల్ఫీ మరణాల్లో అత్యధిక శాతం భారత్ లోనే కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో రష్యా, అమెరికా, పాకిస్థాన్ లు ఉన్నాయి. అయితే సెల్ఫీల కారణంగా మరణించిన వారిలో అత్యధిక శాతం పురుషులేనని అందులోనూ 30 ఏళ్లలోపు యువతే కావడం గమనార్హం.  

అయితే మరణించిన వారిలో 142 మంది ప్రమాదం అని తెలిసి కూడా సెల్ఫీలు కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తమ అధ్యయనంలో వెల్లడించింది. అలాగే 69మంది సెల్ఫీకోసం ప్రయత్నించి ప్రమాదవశాత్తు మృతిచెందిన వారని తెలిపింది. వీరిలో 17 మంది 40ఏళ్లకు పై బడిన వాళ్లు సెల్ఫీ కోసం ప్రయత్నించి చనిపోయినట్లు తెలిపింది. 
 

click me!