RRVL: రిలయన్స్ రిటైల్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. మరో కంపెనీలో మెజార్టీ వాటాను కొనుగోలు

Published : Mar 20, 2022, 10:36 PM IST
RRVL: రిలయన్స్ రిటైల్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. మరో కంపెనీలో మెజార్టీ వాటాను కొనుగోలు

సారాంశం

Reliance Retail Ventures Limited: ప్రముఖ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) తాజాగా కీలక ప్రకటన చేసింది. పర్పుల్ పాండా ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 89% ఈక్విటీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా రూ.950 కోట్ల పెట్టుబడితో క్లోవియా (CLOVIA) వ్యాపారాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది.   

Reliance Retail Ventures Limited: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పర్పుల్ పాండా ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 89% ఈక్విటీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.అధికారిక ప్రకటన ప్రకారం.. సెకండరీ వాటా కొనుగోలు, ప్రాథమిక పెట్టుబడి కలయిక ద్వారా RRVL కంపెనీలో రూ.950 కోట్ల పెట్టుబడితో క్లోవియా (CLOVIA) వ్యాపారాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. 

2013లో పంకజ్ వర్మనీ, నేహా కాంత్ & సుమన్ చౌదరిచే CLOVIA  ప్రారంభించబడింది. ఇది భారతదేశంలో ప్రముఖ బ్రిడ్జ్-టు-ప్రీమియం  D2C బ్రాండ్. మహిళల ఇన్నర్‌వేర్, లాంజ్‌వేర్ ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. తన ఉత్తమ క్వాలిటీతో అత్యధిక కస్టమర్లను కలిగి ఉంది. క్లోవియా కింద 3500లకు పైగా ప్రొడక్ట్ స్టైల్స్ ఉత్పత్తులను కలిగి ఉండడం విశేషం. క్లోవియా ట్రెండింగ్ డిజైన్‌లు మరియు వినూత్న శైలులను అందించడానికి బలమైన ఇన్‌హౌస్ డిజైన్ ప్రక్రియను కలిగి ఉంది.  

ఈ సంద‌ర్భంగా..  రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. “రిలయన్స్ ఎంపికలను మెరుగుపరచడంలో, వినియోగదారులకు ఉత్తమ ఉత్ప‌త్తుల‌ను అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. మా పోర్ట్‌ఫోలియోకు స్టైల్, క్వాలిటీ, డిజైన్-లీడ్ ఇంటిమేట్ వేర్ బ్రాండ్ ‘క్లోవియా’ని జోడించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. వ్యాపారాన్ని మరింత పైకి తీసుకెళ్లేందుకు క్లోవియాలోని బలమైన మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. అని అన్నారు. 
 
క్లోవియా వ్యవస్థాపకుడు & CEO అయిన పంకజ్ వర్మనీ మాట్లాడుతూ..  తాము రిలయన్స్ రిటైల్ ఫ్యామిలీలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. రిలయన్స్ స్కేల్ ఎంటర్ ప్రైజ్ ద్వారా తాము లబ్ధిపొందుతామన్నారు. వరల్డ్ క్లాస్ క్వాలిటీని అందిస్తామన్నారు. క్లోవియాను మోస్ట్ లవ్డ్ బ్రాండ్ గా మారుస్తామన్నారు. ఈ కొనుగోలుతో, ఇన్నర్‌వేర్ విభాగంలో RRVL తన పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుంది. 

రిలయన్స్ ఇప్పటికే Zivame,  Amante బ్రాండ్‌లను కొనుగోలు చేస్తుంది. BDA భాగస్వాములు క్లోవియాకు ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా వ్యవహరించగా, శార్దూల్ అమర్‌చంద్ మంగళదాస్ న్యాయ సలహాదారుగా వ్యవహరించారు.  

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL): 

RRVL అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్( RIL) యొక్క అనుబంధ సంస్థ. RRVL భారతదేశంలో అత్యంత విస్తృతమైన రీచ్‌తో అతిపెద్ద మరియు అత్యంత లాభదాయకమైన రిటైలర్. డెలాయిట్ యొక్క గ్లోబల్ పవర్స్‌లో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైలర్లలో జాబితా చేయబడింది.RRVL మార్చి 31, 2021తో ముగిసిన సంవత్సరానికి రూ. 1,57,629 కోట్ల ($21.6 బిలియన్లు) టర్నోవర్ ఉండ‌గా. ఇందులో రూ. 5,481 కోట్ల ($750 మిలియన్లు) నికర లాభాన్ని నివేదించింది.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?