2024 లోక్‌సభ ఎన్నికలపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ కామెంట్.. ప్రాంతీయ పార్టీలపై ఆయన అభిప్రాయమిదే

By Mahesh KFirst Published Jan 14, 2023, 4:07 PM IST
Highlights

2024 లోక్‌సభ ఎన్నికలపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ఆయన అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే, ప్రాంతీయ పార్టీలకు మంచి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
 

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రముఖులు, విశ్లేషకుల అంచనాలకు ప్రాధాన్యత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందిన అమర్త్య సేన్ 2024 లోక్‌సభ ఎన్నికలపై స్పందించారు. అమర్త్యసేన్ అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వచ్చే జనరల్ ఎలక్షన్ కేవలం ఒకే పార్టీ దూసుకుపోతున్నట్టు ఏమీ ఉండదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి అన్నారు. అలాగే, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ప్రాధాన్యత ఉన్నదని అమర్త్యసేన్ అన్నారు. తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకునే సామర్థ్యం మమతా బెనర్జీకి ఉన్నదా? అని అడగ్గా ఉన్నదని చెప్పారు. అయితే, బీజేపీ వ్యతిరేకతను ఏకం చేయడంలో ఆమె ఇంకా సఫలం కావాల్సి ఉన్నదని వివరించారు.

వచ్చే ఎన్నికల్లో ‘ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ప్రాధాన్యత ఉన్నది. నాకైతే డీఎంకే చాలా ముఖ్యమైన పార్టీ అని అనిపిస్తున్నది. తృణమూల్ పార్టీకీ ప్రాధాన్యత ఉన్నది. సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈ జాబితాలో ఉంటుంది. కానీ, ఎస్పీ ఇంకా ముందుకు వెళ్లుతుందా? లేదా? అనేది చెప్పలేం... దేశాన్ని మొత్తంగా కాకుండా హిందువుల డైరెక్షన్‌లో వెళ్లుతున్నట్టుగా ఎస్టాబ్లిస్ చేసుకుంటున్న బీజేపీని మరే పార్టీ ఎదుర్కోదనే దృక్పథం పొరపాటు అని భావిస్తున్నా’ అని ఆయన వివరించారు.

Also Read: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అవార్డు ను అమర్త్య సేన్ తీసుకోడు.. సేన్ కుటుంబ సభ్యులు దీని పై ఏమన్నారంటే?

‘బీజేపీ భారత దేశ విజన్‌ను కుదించింది. ఈ పార్టీ ఇండియాను కేవలం హిందూ ఇండియా, లేదా హిందీ మాట్లాడే ఇండియాకు బలంగా కుదించేస్తున్నది. కానీ, నేడు మన దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకపోవడం బాధాకరం. ఒక వేళ బీజేపీ బలమైన, శక్తిమంతమైనదిగా కనిపిస్తే.. దాని బలహీనతలు ఉంటాయి. మిగిలిన పార్టీలు నిజంగా తాము కలిసి ఒక ప్రయత్నం చేద్దామా? వద్దా? అనే చర్చ చేసే అవకాశం ఉన్నదనే అనుకుంటున్నా. బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యతను కొట్టివేసేంతలా నాకు ఏమీ కనిపించలేదు’ అని పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

మమతా బెనర్జీ తదుపరి పీఎం అవ్వగలదా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘ఆమెకు ఆ సామర్థ్యం లేదని కాదు. ఆమెకు స్పష్టంగా ఆ సామర్థ్యం ఉన్నది. ఇండియాలో నేటి విచ్ఛిన్నతకు ముగింపు పలికేలా బీజేపీ వ్యతిరేకతను, వ్యతిరేకత శక్తులను ఏక తాటి మీదికి తేగలదని ఆమె ఇంకా నిరూపించుకోలేదు’ అని తెలిపారు.

కాగా, ఆయన 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పై సంశ యాన్ని వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ చాలా బలహీనపడినట్టు కనిపిస్తున్నది. అసలు కాంగ్రెస్ పై ఎంత వరకు ఎవరైనా ఆశలు పెట్టుకోవచ్చే విషయం పై నాకు అవగాహన లేదు. కానీ, ఇతర పార్టీలకు సాధ్యం కాని విధంగా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆల్ ఇండియా విజన్‌ను భారత్‌కు అందిస్తుంది. అయితే, ఆ పార్టీలోనూ పలు విభజనాలు లేకపోలేదు’ అని అమర్త్య సేన్ వివరించారు.

click me!