కోవిడ్, న్యుమోనియాతో హాస్పిటల్ లో చేరిన లలిత్ మోడీ... 24/7 ఎక్స్ టర్నల్ ఆక్సిజన్ సపోర్టుతోనే ట్రీట్ మెంట్

By team teluguFirst Published Jan 14, 2023, 4:02 PM IST
Highlights

ఐపీఎల్ సృష్టికర్త, మాజీ చైర్మన్ లలిత్ మోడీ కోవిడ్, న్యూమోనియాతో బాధపడుతున్నారు. దీంతో ఆయన హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. 24 గంటల పాటు ఎక్స్ టర్నల్ ఆక్సిజన్ సపోర్టుతోనే ఆయనకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. 

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కరోనా సోకడంతో పాటు న్యుమోనియా కూడా దాడి చేయడంతో ఆయన హాస్పిటల్ లో చేరారు. 24/7 ఆక్సిజన్ సపోర్టుతోనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని లలిత్ మోడీయే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో వెల్లడించారు. 

పౌరసత్వ చట్టంతో మైనారిటీల పాత్రను తగ్గించడమే బీజేపీ లక్ష్యం: అమర్త్యసేన్

రెండు వారాల్లో తనకు రెండుసార్లు కోవిడ్ సోకిందని తెలిపారు. దీంతో పాటు గాఢమైన న్యుమోనియా కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో తాను హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందని తెలిపారు. ఈ పోస్టుతో పాటు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఫొటోను కూడా ఆయన 
షేర్ చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lalit Modi (@lalitkmodi)

‘‘ఇన్‌ఫ్లుఎంజా, లోతైన న్యుమోనియాతో పాటు 2 వారాల్లో రెండు సార్లు కోవిడ్ సోకింది. మూడు వారాల నిర్బంధం తరువాత నిర్బంధం అనంతరం బయటకు వెళ్లడానికి అనేకసార్లు ప్రయత్నించాను. చివరకు ఇద్దరు డాక్టర్లు, ఒక సూపర్ స్టార్ కొడుకుతో కలిసి ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్ లో ల్యాండ్ అయ్యాను. విమానం సాఫీగా సాగింది. అయినా దురదృష్టవశాత్తూ ఇంకా 24/7 ఎక్స్ టర్నల్ ఆక్సిజన్ సపోర్ట్ తోనే ఉన్నాను. అదనపు మైలు దూరం తీసుకొచ్చినందుకు విస్టాజెట్ వద్ద ఉన్న అందరికీ ధన్యవాదాలు. అందరికీ రుణపడి ఉంటాను. అందరికీ ప్రేమ. బిగ్ హగ్ ’’ అని లలిత్ మోడీ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో తెలిపారు. మెక్సికో సిటీలో తనకు చికిత్స అందించిన వైద్యులకు, లండన్ నుంచి యూకేకు తిరిగి వచ్చిన వారికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

మరో యాత్రకు సిద్ధమవుతున్న కాంగ్రెస్.. హత్ సే హత్ జోడో యాత్రగా నామకరణం.. ఎప్పటి నుంచి అంటే ?

టీ20 లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు నాంది పలికిన నీరవ్ మోడీ 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్, ప్రసార ఒప్పందాలను తారుమారు చేశారన్న ఆరోపణలతో భారత్ నుంచి లండన్ కు పయనమయ్యారు. ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మొదటి చైర్మన్ అయిన ఆయన మూడు సంవత్సరాల పాటు టోర్నమెంట్ ను నిర్వహించాడు. కానీ అనేక అవకతవకల ఆరోపణలతో తరువాత భారత క్రికెట్ నుండి ఆయన బహిష్కరణకు గురయ్యారు. 

click me!