మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయం: కోర్టుకు వెళ్లే యోచనలో ఏక్‌నాథ్ షిండే వర్గం

By narsimha lodeFirst Published Jun 26, 2022, 3:42 PM IST
Highlights

శివసేన రెబెల్స్ ఎమ్మెల్యేలు ముంబై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం. శివసేన శాసనసభపక్ష నేతగా ఏక్ నాథ్ షిండేగా తొలగించడంపై రెబెల్స్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మరో వైపు ఉద్దవ్ ఠాక్రేకు మద్దతుగా శివసైనికులు ఇవాళ ర్యాలీలు నిర్వహించారు. 

ముంబై: Shiv Sena పార్టీ శాసనసభ పక్షనేతగా తనను తొలగించడంపై Eknath Shinde  ముంబై కోర్టును ఆశ్రయించే అవకాశం  ఉంది.  శివసేన శాసనసభ పక్ష నేతగా షిండేను తొలగిస్తూ మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ అభిప్రాయాన్ని కోరిన తర్వాత తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం  Mumbai Court ను ఆశర్యించనున్నట్టుగా జాతీయ మీడియా సంస్థ ప్రకటించింది. తాము సమాధానం ఇవ్వడానికి డిప్యూటీ స్పీకర్ కనీసం ఏడు రోజుల సమయం ఇస్తే బాగుండేదని  రెబెల్ వర్గం అభిప్రాయంతో ఉంది.

Uddhav Thackeray ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు గౌహాతిలో ఉన్న ఏక్‌నాథ్ షిండే వర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

also read:Maharashtra political crisis : 15 మంది తిరుబాటు ఎమ్మెల్యేల‌కు ‘వై ప్లస్’ భద్రత కల్పించిన కేంద్రం

ఆదివారం నాడు Sharad Pawar నివాసంలోని సిల్వర్ ఓక్ లో మహా వికాస్ అఘాడీ నేతల సమావేశంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న అస్థిరత నేపథ్యంలో న్యాయపోరాటం జరిపే విషయమై చర్చించారు.  Congress సీనియర్ నేతలు, మంత్రులు బాలసాహెబ్  థోరట్, ఆశోక్ చవాన్, శివసేనకు చెందిన అనిల్ దేశాయ్, పరబ్, రాష్ట్ర మంత్రులు దిలీప్ వాల్సే పాటిల్, అజిత్ పవార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ జారీ చేసిన అనర్హత నోటీసులను కోర్టులో సవాల్ చేస్తామని కూడా షిండే వర్గం చెప్పడంతో ఈ విషయమై కూడా పవార్ నివాసంలో జరిగిన చర్చల్లో నేతలు చర్చించారు.

మరో వైపు శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ముంబైలో ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ముంబై పట్టణంలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు శివసైనికులు.శివసేన పుణె సిటీ అధ్యక్షుడు గజానన్ శివసేన రెబెల్స్ కు వార్నింగ్ ఇచ్చారు. రెబెల్స్ ఎమ్మెల్యేల పోటోలతో నిరసనకు దిగారు. ఈ నిరసనలు దేశద్రోహులను శివ సైనికులు క్షమించరనే సందేశన్ని ఇవ్వడానికి ఉద్దేశించాయన్నారు. శివసేన రెబెల్స్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రతను కేటాయించింది. 15 మంది Rebel  ఎమ్మెల్యేల ఆస్తులపై  శివసైనికులు దాడికి దిగారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇదిలా ఉంటే Maharashtra గవర్నర్ Bhagat Singh Koshyari కోవిడ్ నుండి కోలుకొని ఆసుపత్రి నుండి ఇవాళ ఢిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల సలహా మేరకు గవర్నర్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. రెండురోజుల వరకు ఎవరికీ కూడా అపాయింట్ మెంట్ లేదని Raj bhavan  వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే పోలీస్ ఉన్నతాధికారులతో  గవర్నర్ శాంతి భద్రతల విషయమై చర్చించినట్టుగా తెలుస్తోంది.

శివసేనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై మంత్రి ఆదిత్య ఠాక్రే కీలక ప్రకటన చేశారు. ద్రోహులు అయిన తిరుగుబాటు ఎమ్మెల్యేలను తిరిగి పార్టీ స్వాగతించదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీని వీడాలనుకునే వారికి పార్టీలోకి తిరిగి రావాలనుకొనేవారికి పార్టీ తలుపులు తెరిచే ఉంటుందన్నారు. ద్రోహులుగా ఉన్న వారిని  పార్టీ తిరిగి తీసుకోదని ఆదిత్య ఠాక్రే చెప్పారు.

click me!