9 బ్యాంకులు మూసేస్తున్నారు.. డబ్బు తీసేసుకోండి: పుకార్లేనన్న ఆర్బీఐ

By Siva KodatiFirst Published Sep 25, 2019, 7:45 PM IST
Highlights

దేశంలోని తొమ్మిది వాణిజ్య బ్యాంకులను మూసివేస్తున్నారంటూ వస్తున్న పుకార్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దనీ ఆర్బీఐ ప్రజలను హెచ్చరించింది

దేశంలోని తొమ్మిది వాణిజ్య బ్యాంకులను మూసివేస్తున్నారంటూ వస్తున్న పుకార్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దనీ ఆర్బీఐ ప్రజలను హెచ్చరించింది.

పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆరు నెలల పాటు కొన్ని పరిమితులు విధించింది. దీంతో ఆయా బ్యాంకుల్లో ఖాతాలున్న వారు రోజుకు రూ.1000కి మించి క్యాష్ విత్‌డ్రా చేయడానికి వీలు లేకుండా పోయింది.

దీంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేయగా.. ఆర్‌బీఐ తొమ్మిది బ్యాంకులను శాశ్వతంగా మూసివేయాలని భావిస్తోందని.. మీ ఖాతాల్లో ఉన్న నగదును పసంహరించుకోవాలంటూ కొందరు పుకార్లు వ్యాపింపజేశారు.

సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి రంగంలోకి దిగారు. ఏ ప్రభుత్వరంగ బ్యాంక్‌ను మూసివేసే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఆకతాయిల పనిగా పేర్కొన్నారు. 

click me!