డయల్ 112: ఢిల్లీలో ఇక నుంచి అన్ని సేవలకు ఒకే నెంబర్

By Siva KodatiFirst Published Sep 25, 2019, 5:06 PM IST
Highlights

ఢిల్లీ పోలీసులు ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు మరో ప్రయోగం చేపట్టారు. అత్యవసర సేవలన్నింటినీ ఒకే గొడుగు తీసుకొచ్చే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన అత్యవసర నెంబర్ 112ను బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చారు

ఢిల్లీ పోలీసులు ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు మరో ప్రయోగం చేపట్టారు. అత్యవసర సేవలన్నింటినీ ఒకే గొడుగు తీసుకొచ్చే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన అత్యవసర నెంబర్ 112ను బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చారు.

అత్యవసర సమయంలో కాల్ చేసిన వ్యక్తి లోకేషన్ ట్రేస్ చేసి వారికి అతి త్వరగా సేవలను అందించడం దీని ముఖ్యోద్దేశం. 112 నెంబర్‌కు ఫోన్ చేస్తే నెట్‌వర్క్ సిగ్నల్స్ లేదా జీపీఎస్ ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌కు కనెక్ట్ అవుతుంది. అక్కడ వారికి అవసరమయ్యే సేవలను సిబ్బంది అందిస్తారు.

ప్రజలు 100, 101, 102 సేవలకు ఫోన్ చేస్తే అది అంతిమంగా 112కే కనెక్టవుతుందని అధికారులు తెలిపారు. ఒకే దేశం ఒకే ఎమర్జెన్సీ నెంబర్ అనే విధానం అమెరికాలో అమల్లో ఉంది. ఆ దేశంలో అన్ని రకాల సేవలకు గాను 911 అనే నెంబర్‌నే వినియోగిస్తారు.

112 విధానంపై ఢిల్లీ పోలీస్ కమీషనర్ ముక్తేశ్ చంద్రా మాట్లాడుతూ.. దీని వల్ల డబ్బు, సమయం ఆదా అవ్వడమే కాకుండా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందుతాయన్నారు.

ఈ సేవల కోసం కొత్త సిబ్బందిని నియమించడంతో పాటు కంట్రోల్ రూమ్ భవనాన్ని శాలిమార్‌బాగ్‌లోని కొత్త భవనానికి బదిలీ చేయనున్నారు. అక్కడ పూర్తిగా కాగితరహితంగా కార్యకలాపాలను నిర్వహించనున్నారు. 

click me!