
భారత జట్టు క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. జామ్‌నగర్ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర జడేజా ఓ మహిళతో వాగ్వాదానికి దిగారు. వీడియోలో రివాబా చాలా కోపంగా కనిపించారు. ఓ పబ్లిక్ ఈవెంట్‌లో రివాబా జడేజాకు ఎక్కడ లేని కోపం వచ్చిందని చెబుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. జామ్‌నగర్ నగరంలోని లఖోటా సరస్సు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ 'మేరీ మతి, మేరా దేశ్'అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జామ్‌నగర్ ఎంపీ పూనమ్ మేడమ్, జామ్‌నగర్ మేయర్ బీనాబెన్ కొఠారితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రివాబా జడేజా, మేయర్ బీనాబెన్ కొఠారీ మధ్య ఏదో ఒక అంశంపై వాగ్వాదం మొదలైంది.
ఎమ్మెల్యే రివాబా జడేజా మాట్లాడుతూ.. నిశ్చింతగా ఉండండి, తెలివిగా వ్యవహరించవద్దని, దీని వెనుక మీ హస్తం ఉందన్నారు. ఎన్నికల సమయంలో మీలాంటి పెద్దలను చాలా మందిని చూశానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పూనమ్ మేడమ్ పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు, కానీ కోపంతో ఉన్న రివాబా జడేజా.. మేయర్ బీనాబెన్ కొఠారీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.నగర మేయర్ బీనా కొఠారి అనవసరంగా జోక్యం చేసుకున్నారనీ, ఎంపీకి మద్దతుగా మాట్లాడటం వలన ఆమెపై విరుచుకుపడ్డాడని రివాబా చెప్పారు.
ఏమీ తెలియకుండా కొందరు తెలివిగా వ్యవహరిస్తున్నారని రివాబా జడేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మాత్రమే కాదు, రివాబా జడేజా కూడా ఎంపీ పూనంబెన్ మేడమ్‌ను మంచి,చెడు తెలుసుకోవాలని అన్నారు. నువ్వు ఇదంతా చేస్తున్నావు.. ఆపడానికి ప్రయత్నించు అని రివాబా ఎంపీకి చెప్పారు. జిల్లా పోలీసు చీఫ్ ప్రేమ్‌సుఖ్ దేలు జోక్యంతో మొత్తం వ్యవహారం సద్దుమణిగింది. గతేడాది జామ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి రివాబా జడేజా విజయం సాధించారు.