సామాన్యుల‌ను తన పెయింటింగ్స్ తో ఆహ్లాద‌ప‌ర్చిన ‘రాజా రవి వర్మ‘

By team teluguFirst Published Aug 5, 2022, 2:56 PM IST
Highlights

18వ శతాబ్దానికి చెందిన రాజా రవి వర్మ గొప్ప చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ ఇతిహాసాలు, పురాణాలు ఆధారంగా చిత్రాలు గీసేవారు. తన పెయింటింగ్స్ ను సామాన్యులకు అందుబాటులో ఉంచి వారికి ఆహ్లాదాన్ని పంచేవారు. 

భారతీయ కళ చరిత్రలో రాజా రవివర్మ గొప్ప చిత్రకారులలో ఒకరిగా గుర్తిస్తారు. ఆయ‌న 18వ శ‌తాబ్దానికి చెందిన వ్య‌క్తి.  ఆయ‌న ఇది ప్రధానంగా పురాణాలు (ప్రాచీన పురాణ కథలు), గొప్ప భారతీయ ఇతిహాసాలు అయిన మహాభారతం, రామాయణం ఇతి వృత్తంగా చిత్రాల‌ను గీశారు. వీటి ద్వారా ఆయ‌న గొప్ప కీర్తి గ‌డించారు. యూరోపియన్ అకడమిక్ ఆర్ట్ మెళకువలతో భారతీయ సంప్రదాయం  అందమైన కలయికను సాధించగలిగిన కొద్దిమంది చిత్రకారులలో రవివర్మ ఒకరు. 

ఆధునిక భారతీయ కళ పితామహుడిగా కూడా ఆయ‌న‌ను అభివ‌ర్ణిస్తుంటారు. యూరోపియన్లు, ఇతర కళాభిమానులు ఆయ‌న సాంకేతికతను మెచ్చుకోగా, భారతదేశంలోని సామాన్యులు కూడా అత‌డి పనిని చూసి ఆనందించారు. తరచుగా కానప్పటికీ, వర్మ పెయింటింగ్స్ అందరూ మెచ్చుకునే సౌత్ ఇండియన్ మహిళల అందాలను హైలైట్ చేశాయి. హిందూ దేవుళ్లు, దేవతలపై ఆయ‌న గీసిన చిత్రాలు అట్టడుగు కులాలకు చెందిన చాలా మందికి పూజా సామగ్రిగా మారింది. ఆయ‌న త‌న పెయింటింగ్ ల సరసమైన (లితోగ్రాఫ్‌)కాపీలను ప్రజలకు అందుబాటులో ఉంచడంలో ప్రసిద్దిగాంచారు. ఈ అంశం ఒక చిత్ర‌కారుడిగా, ప్రజా వ్యక్తిగా ఆయ‌న ప‌రిధిని, ప్ర‌భావాన్ని బాగా పెంచింది. ఆయ‌న ఘనతను గుర్తించిన వైస్రాయ్ లార్డ్ కర్జన్ ‘కైసర్-ఐ-హింద్’ బంగారు పతకంతో సత్కరించారు.

ఏప్రిల్ 29, 1848న ట్రావెన్‌కోర్‌లోని కిలిమనూర్‌లో ర‌వివ‌ర్మ జ‌న్మించారు. త‌న ఏడేళ్ల వ‌య‌స్సులో కిలిమనూరు ప్యాలెస్ గోడలపై బొగ్గు సహాయంతో తన చిత్రలేఖన నైపుణ్యాన్ని మొద‌టి సారిగా ఆవిష్కరించారు. ఆయ‌న భార‌త దేశానికి దక్షిణాన (కేరళ, తమిళనాడు ప్రాంతం) ఉన్న ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి దగ్గరి వ్య‌క్తి. అయినా సమాజంలో త‌న హోదాతో సంబంధం లేకుండా, మాస్ మార్కెట్‌కి తన రచనలను అందించిన మొద‌టి క‌ళాకారుడిగా ఆయ‌న నిలుస్తారు. 

రవివర్మ హిందూ దేవతలను, ఇతిహాసాలు, పురాణాలలోని ప‌లు ఘ‌ట‌న‌ల‌ను వ‌ర్ణిస్తూ ఎక్కువ‌గా పెయింటింగ్స్ వేశారు. ఇవి ప్ర‌జ‌ల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. రవివర్మ జీవితం ఆధారంగా నాలుగు సినిమాలు డాక్యుమెంట్ రూపంలో వ‌చ్చాయి.  రాజా రవివర్మ మొత్తం 7000 కంటే ఎక్కువ చిత్రాలను రూపొందించారు, అందులో దమయంతి హంసతో మాట్లాడటం, శకుంతల దుష్యంతుడిని వెతకడం, నాయర్ లేడీ ప్రదర్శనలు, శంతను, మత్స్యగంధ పెయింటింగ్‌లు ప్ర‌సిద్ధి చెందాయి. 

రాజా రవి వర్మ వేసిన పెయింటింగ్స్ ఆ రోజుల్లో ఎంత ఫేమ‌స్ గా నిలిచాయో.. ఇప్పుడు కూడా వాటికి అంతే క్రేజ్ ఉంది. ట్రావెన్‌కోర్ మహారాజా, అతడి సోదరుడు మద్రాస్ గవర్నర్ జనరల్ రిచర్డ్ టెంపుల్ గ్రెన్‌విల్లేను స్వాగతిస్తున్నట్లు చూపుతున్న అతడి కళాఖండం దాదాపు 25 మిలియన్ డాలర్లకు 2007 సంవ‌త్స‌రంలో అమ్ముడుపోయింది. భారతీయ చిత్రకళకు విశేష కృషి చేసిన రాజా రవివర్మ 1906 అక్టోబరు 2న త‌న 58 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఆయ‌న మ‌న‌ మధ్య లేకపోయినా, తన చిత్రాల రూపంలో ఇంకా స‌జీవంగానే ఉన్నారు. 

వడోదరలోని లక్ష్మీవిలాస్ ప్యాలెస్‌లో రాజా రవివర్మ వేసిన భారీ చిత్రాల సేకరణను ఇప్ప‌టికీ మ‌నం అంద‌రం చూడొచ్చు. ఆయన అద్భుతమైన చిత్రాలకు దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. 1878లో వియన్నాలో జరిగిన ఎగ్జిబిషన్‌లో అతనికి బహుమతి లభించింది, అలాగే చికాగోలో 1893 వరల్డ్స్ కొలంబియన్ ఎక్స్‌పోజిషన్‌లో అతని కళాఖండాలు మూడు బంగారు పతకాలను అందుకున్నాయి. 
 

click me!