రేవ్ పార్టీకి కొడుకుతో పాటు హాజరైన మహిళా కానిస్టేబుల్: సస్పెన్షన్

By narsimha lodeFirst Published Apr 19, 2021, 9:34 PM IST
Highlights

 చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు శాఖలో పనిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న కానిస్టేబుల్ పై పోలీస్ శాఖ చర్యలు తీసుకొంది.


బెంగుళూరు: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు శాఖలో పనిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న కానిస్టేబుల్ పై పోలీస్ శాఖ చర్యలు తీసుకొంది.  కొడుకుతో పాటు రేవ్ పార్టీలో మహిళా కానిస్టేబుల్ పాల్గొంది. సెలవు పెట్టి మరీ ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుా పోలీసులు గుర్తించారు. 

మంగుళూరు జిల్లాలోని క్రైం విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీలత అనే మహిళా కానిస్టేబుల్  రేవ్ పార్టీలో పాల్గొంది.  ఈ పార్టీలో పొల్గొన్నవారితో పాటు ఆమెను కూడ పోలీసులు  అరెస్ట్ చేశారు.  ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టుగా మంగుళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ ప్రకటించారు.కొడుకుతో కలిసి రేవ్ పార్టీకి ఆమె వెళ్లింది.  పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో ఆమె తన అధికారాన్ని అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేసిందని కమిషనర్ తెలిపారు.  

 ఆలూరు తాలూకాలో ఒక రిసార్టులో పెద్దఎత్తున రేవ్‌ పార్టీ జరిగింది. ఇది తెలిసి పోలీసులు దాడి చేసి 130 మందిని అదుపులోకి తీసుకుని పదుల సంఖ్యలో కార్లను సీజ్‌ చేశారు. ఈ పార్టీకి హాజరైన వారు ఉపయోగించిన వాహనాల్లో అత్యవసర డ్యూటీ స్టిక్కర్లున్నాయని పోలీసులు తెలిపారు. రిసార్ట్ యజమాని గగన్ ను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసులునమోదు చేశారు.
 

click me!