ఇండియాలో కరోనా తగ్గుముఖం: మూడు నెలల తర్వాత 35 వేల లోపు

By narsimha lodeFirst Published Jul 6, 2021, 10:01 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 34,704 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 553 మంది కరోనాతో మరణించారు.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 34,704 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 553 మంది కరోనాతో మరణించారు.దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 4,64,357కి చేరుకొన్నాయి. దేశంలో కరోనా కేసులు ఈ ఏడాది మార్చి 28వ తేదీ తర్వాత అతి తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి.  ఆ రోజున ఇండియాలో  కరోనా కేసులు 28,903గా నమోదయ్యాయి.  

ఇక మహారాష్ట్రలో కూడ కరోనాతో మరణించిన వారి సంఖ్య తగ్గిపోయింది.ఈ ఏడాది మార్చి 15న మహారాష్ట్రలో కరోనాతో 48 మంది మరణించారు. ఆ తర్వాత  సోమవారం నాడు నమోదైన కేసుల సంఖ్య అతి తక్కువ. గత 24 గంటల్లో మహారాష్ట్రలో కరోనాతో 51 మంది మరణించారు.దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుదల కన్పిస్తోంది. లాక్ డౌన్ కారణంగా కేసుల సంఖ్య తగ్గింది. రానున్న రోజుల్లో మూడో వేవ్ కూడ వచ్చే అవకాశం ఉన్నందున  జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

click me!