ఒక్కచేప రూ. 72 లక్షలు.. ఇలాంటిదొక్కటి వలలో పడితే జాక్ పాటే... !!

Published : Jun 01, 2021, 09:56 AM IST
ఒక్కచేప రూ. 72 లక్షలు.. ఇలాంటిదొక్కటి వలలో పడితే జాక్ పాటే... !!

సారాంశం

అదృష్టమంటే పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని గ్వాదర్ తీరానికి చెందిన మత్స్యకారుడు సాజిద్ హాజీ బాబా అబాబాకర్ దే. ఎందుకంటే ఒకేఒక చేప పట్టాడు. ఏకంగా 72 లక్షల రూపాయలు సంపాదించాడు.  

అదృష్టమంటే పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని గ్వాదర్ తీరానికి చెందిన మత్స్యకారుడు సాజిద్ హాజీ బాబా అబాబాకర్ దే. ఎందుకంటే ఒకేఒక చేప పట్టాడు. ఏకంగా 72 లక్షల రూపాయలు సంపాదించాడు.  

అయితే అబాబాకర్ పట్టింది మామూలు చేప కాదు.  అరుదైన అట్లాంటిక్ క్రోకర్ జాతికి చెందినది. అందుకే 48 కేజీల బరువైన ఈ చేపకు వేలంలో ఏకంగా 72 లక్షల రూపాయల ధర పలికింది.

యూరప్, చైనాలో ఈ క్రోకర్ జాతికి అత్యధిక డిమాండ్ వుంది. చాలా  చేపల విలువ వాటి మాంసం ఆధారంగా నిర్ణయమవుతుంది. అయితే క్రోకర్ జాతి చేప విషయం వేరు.

వైద్యపరంగా ఈ చేపలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. దీని చర్మాన్ని, ఎముకలను ఔషధాల్లో, ఇతర వైద్యపరమైన అంశాల్లో వాడతారు. అందుకే దీనికి అంత ధర.

నిజానికి వేలంలో ధర ఇంకా ఎక్కువే పలికింది. 86.4 లక్షల రూపాయల వరకు వెళ్లింది. అయితే అంత ధరకు చేజిక్కించుకున్న వారికి రాయితీలు ఇవ్వడం స్థానికంగా సంప్రదాయం. అందుకే అధికారులు చివరికి రూ. 72 లక్షలు గా ధరను ఖరారు చేశారు. గత వారం కూడా  గ్వాదర్ తీరంలోనే ఒక మత్స్యకారుడు ఈ క్రోకర్ జాతి చేపను పట్టాడు. వేలంలో అది 7.8 లక్షలకు అమ్ముడైంది.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..