Kochi Tattoo Studio Case : టాటు నెపంతో..యువ‌తుల‌పై లైంగిక దాడులు.. అరెస్ట్

Published : Mar 07, 2022, 02:19 AM IST
Kochi Tattoo Studio Case :  టాటు నెపంతో..యువ‌తుల‌పై లైంగిక దాడులు.. అరెస్ట్

సారాంశం

Kochi Tattoo Studio Case : టాటూలు వేసే నెపంతో ఆరుగురు మ‌హిళ‌ల‌పై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలపై కొచ్చికి చెందిన ప్రముఖ టాటూ ఆర్టిస్ట్‌ను కేరళ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.  

Kochi Tattoo Studio Case : మ‌హిళ‌లు, చిన్నారుల ర‌క్ష‌ణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. దారుణమైన శిక్షలు విధించిన కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఆడవారు కనిపిస్తే చాలు.. చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా కండ్లు కామంతో మూసుక‌పోతున్నాయి.  దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే.. టాటూలు వేసే నెపంతో రెచ్చిపోయి ఆరుగురు మ‌హిళ‌ల‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. రెచ్చిపోయి.. మరి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటన కేరళలోని ఎటప్పళ్లిలో వెలుగులోకి వచ్చింది.  

వివరాల్లోకెళ్తే.. కేరళలోని ఎటప్పళ్లిలో సుజీష్(35) అనే టాటు ఆర్టిస్‌, ఆయ‌న ఇంక్‌ఫెక్టెడ్ టాటూ స్టూడియో న‌డుపుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న‌ టాటూ స్టూడియోకు టాటు వేసించుకోవడానికి  18 ఏళ్ల  యువ‌తి వ‌చ్చింది.  టాటూ వేసే నెపంతో సుజీష్ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని  వివరిస్తూ .. స‌ద‌రు యువ‌తి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్ర‌స్తుతం నెట్టింట్లో  వైరల్ అయింది.
 
ఆమె పోస్ట్ ఆధారంగా ఎర్నాకులం పోలీసులు సుజీష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఈ విషయం బయటకు రావటంతో అతడి చేతిలో మోసపోయిన మరో ఆరుగురు మహిళలు కూడా ఆ పోస్టులో తాము కూడా సుజీష్ చేతిలో మోసపోయినట్లు పేర్కోన్నారు. సుజీష్ వారిపై చేసిన లైంగికవేధింపులను పోలీసులకు  వివరించారు.

ఈ విష‌యాన్ని తెలుసుకున్న సుజీష్ పరార్ అయ్యాడు. చివ‌రికి అతడిని గాలించి ప‌ట్టుకున్నారు.  దీంతో పోలీసులు నిందితుడిపై 164 బి సెక్షన్  కింద కేసులు నమోదు చేసారు. త్వ‌ర‌లో మెజిస్ట్రేట్ ముందు  హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది వ్యాపార పోటీలో భాగంగా జరిగిన కుట్ర లో భాగమే అని అతని స్నేహితులు పేర్కోన్నారు. అతను ఎవరినీ  లైంగికంగా వేధించలేదని  అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు