Minor Rape In Rajasthan: 12 ఏండ్ల బాలిక‌పై ప‌లువురు అత్యాచారం.. డబ్బుు కోసం సొంత తాతయ్యనే...

Published : May 13, 2022, 06:53 AM IST
Minor Rape In Rajasthan: 12 ఏండ్ల బాలిక‌పై ప‌లువురు అత్యాచారం.. డబ్బుు కోసం సొంత తాతయ్యనే...

సారాంశం

Minor Rape In Rajasthan: రాజస్థాన్‌లో స‌మాజం త‌ల‌దించుకునే అమానవీయ ఘటన జరిగింది. బుండీ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు, దీంతో ఆమె గర్భవతి అయింది. ఆశ్చర్యకరంగా.. బాలిక తాత‌య్య‌నే ఆమెపై అత్యాచారం చేసేందుకు నిందితుల్లో ఒకరికి అనుమతించ‌డం గ‌మ‌నార్హం.    

Minor Rape In Rajasthan: చిన్నారుల, మ‌హిళ‌ల సంర‌క్ష‌ణ కోసం  ప్ర‌భుత్వాలు నిర్భ‌య లాంటి క‌ఠిన చ‌ట్టాలు తీసుక‌వ‌చ్చినా.. వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నిత్యమూ ఏదొక చోట మహిళలు, బాలికలపై దారుణాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఏ మాత్రం ఆదమరిచినా.. మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా.. కంటి రెప్ప‌లా కాపాడాల్సిన తాత‌య్య‌నే 
మద్యానికి బానిసై దారుణానికి పాల్ప‌డ్డారు. 12 ఏళ్ల ఓ గిరిజన బాలికపై ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు.బాలిక గ‌ర్బ‌వ‌తి కావ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆశ్చర్యకరంగా.. బాలికపై అత్యాచారం చేసేందుకు నిందితుల్లో ఒకరికి అనుమతి ఇచ్చింది ఆ బాలిక తాత‌య్య కావ‌డం శోచ‌నీయం. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్​లో జరిగింది. 
 
రాజస్థాన్‌లోని బుండీ జిల్లాలో 12 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కళ్లు తిరిగి పాఠ‌శాల‌లో పడిపోవడంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యుల‌కు అనుమానం రావ‌డంతో వైద్య పరీక్షల‌కు పంపించ‌గా.. ఐదు నెలల గర్భిణి అని తేలింది. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానికి సొంత తాత సహకారం అందించాడు. ఆమె తాత స్నేహితుడు రాంలాల్ భిల్ (50) అత్యాచారానికి పాల్పడ్డాడని బుండి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) జై యాదవ్ తెలిపారు. బాధితురాలి తాత మద్యానికి బానిస కావడంతో ఇంట్లోనే నేరం జరగడానికి అనుమతించాడు.  మరో నిందితుడు 20 ఏళ్ల అజయ్​ భైరవ.. గత ఆరు నెలల్లో అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట పెడితే చంపెస్తానని బెదిరించాడు. నిందితులతో పాటు బాలిక తాతను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను గురువారం కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.

బాలిక తండ్రి 12 ఏళ్ల కిందే మరణించాడు దీంతో మతిస్తిమితం లేని తన తల్లితో కలిసి తాతయ్య వద్ద నివసిస్తోంది. కాగా, మద్యానికి బానిసైన బాలిక తాతయ్య  డ‌బ్బుల కోసం ఆమెపై అత్యాచారానికి ప్రోత్సహించాడు. బాలికకు చికిత్స కొనసాగుతుందని.. అబార్షన్​కు అనుమతి లభించినట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం