
అత్యాచార బాధితురాలిని బిడ్డకు జన్మనివ్వాలని బలవంతం చేయరాదని యూపీలోని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. 12 ఏళ్ల వయస్సున్న అత్యాచార బాధితురాలు తన 25 వారాల గర్భాన్ని తొలగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అత్యాచారానికి పాల్పడిన పురుషుడి బిడ్డకు జన్మనివ్వాలని బాధిత మహిళను బలవంతం చేయరాదని వ్యాఖ్యానించింది.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర చొరబాటు భగ్నం.. టెర్రరిస్టును హతమార్చిన ఆర్మీ..
‘‘అత్యాచార బాధితురాలికి తన శరీర స్థితిని నిర్ణయించే హక్కు ఉంది. లైంగిక దాడి విషయంలో ఒక మహిళకు గర్భం తొలగించడానికి నో చెప్పే హక్కును నిరాకరించడం, మాతృత్వ బాధ్యతను ఆమెకు కట్టబెట్టడం, ఆమె శరీరానికి సంబంధించి గౌరవంగా జీవించే మానవ హక్కును నిరాకరించినట్లే అవుతుంది. ఇందులో తల్లి కావడానికి ఆమె అవును లేదా కాదు అని చెప్పడం కూడా ఉంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తన 25 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 12 ఏళ్ల బాలిక తన తల్లి సాయంతో హైకోర్టును ఆశ్రయించింది. బాధితురాలికి చెవులు వినిపించవు, అలాగే మాటలు కూడా రావు. ఆమెుపై పొరుగింటి వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కానీ ఈ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేకపోయింది. కానీ ఆమె సైన్ లాంగ్వేజ్ ఉపయోగించి తన తల్లికి విషయం తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది.
2023 జూన్ 16న బాధితురాలు 23 వారాల పిండంతో, గర్భవతిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు జూన్ 27వ తేదీన మెడికల్ బోర్డు ముందు ఉంచారు. అయితే గర్భస్రావం కోసం గర్భం 24 వారాల మార్కును అప్పటికే దాటిందని బోర్డు పేర్కొంది. గర్భం దాల్చి 24 వారాల కంటే ఎక్కువగా ఉందని, కాబట్టి అబార్షన్ చేసే ముందు కోర్టు అనుమతి అవసరమని అభిప్రాయపడింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎంటీపీ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం.. 20 వారాలు మించిన గర్భాన్ని తొలగించడం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఉంటుంది.
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు అస్వస్థత.. హాస్పిటల్ కు తరలించిన జైలు అధికారులు
గర్భాన్ని కొనసాగించడం వల్ల మహిళ ప్రాణాలకు ముప్పు ఉందని, అలాగే ఆమె శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం కలిగించిన సందర్భంలో మాత్రమే అబార్షన్ కు అనుమతి లభిస్తుంది. అయితే బాధితురాలు ఎంటీపీ చట్టంలోని ప్రత్యేక కేటగిరీల కిందకు వస్తుందని కోర్టు పేర్కొంది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు అలీగఢ్ లోని జవహర్ లాల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను ఓబీఎస్ అండ్ గైనే విభాగం నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశించాలని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ను కోర్టు కోరింది. ఇందులో అనస్థీషియా విభాగం, రేడియో డయాగ్నసిస్ విభాగం బాధితురాలని పరీక్షించి నివేదికను జూలై 12న సమర్పించాలని ఆదేశింది. ఈ నివేదిక ప్రకారం కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది.