
హసన్: కర్ణాటకలోని హసన్ లో కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మర్నాడు ఉదయం పూట మైసూరుకు బస్సులో వెళ్లాల్సిన బాలిక తన తల్లిదండ్రులతో బస్ స్టాండు సమీపంలో నిద్రిస్తోంది.
తల్లిదండ్రులు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు గాఢంగా నిద్రపోయిన స్థితిలో నిందితుడు బాలికను నిర్మానుష్యమైన ప్రదేశానికి ఎత్తుకెళ్లాడు. అతను బాలికపై అత్యాచారం చేసి ఆమెను పొదల్లో పడేశాడు.
నిందితుడు బాలికను ఎత్తుకెళ్లడానికి ముందు గంట నుంచి వారిని పరిశీలిస్తున్నాడని, పొదల్లోంచి కేకులు వినిపిస్తుండడంతో అటుగా వెళ్తున్న వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలని హెచ్ఐఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. ఆ సంఘటన సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.