మహిళల బట్టల వల్లే అత్యాచారాలు.. బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణ..

Published : Feb 10, 2022, 10:22 AM ISTUpdated : Feb 10, 2022, 10:36 AM IST
మహిళల బట్టల వల్లే అత్యాచారాలు.. బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణ..

సారాంశం

మహిళలు వేసుకునే బట్టల వల్లే పురుషులు ఉద్రేకానికి గురవుతున్నారని.. దీనివల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిమీద తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో.. క్షమాపణలు తెలిపారు.

బెంగళూరు : తరచూ వివాదాల్లో ఉండే BJP MLA Renukacharya మళ్లీ వివాదాన్ని రేకెత్తించారు. మహిళల Clothesను చూసి పురుషులు ఉద్రేకానికి గురవుతారని ఆయన బుధవారం ఢిల్లీలో అన్నారు. Women Bikini ధరించటం వారి హక్కు అని కాంగ్రెస్ నాయకురాలు Priyanka Gandhi చెప్పడాన్ని ఖండించారు. ఆమె దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కొన్నిసార్లు మహిళల వస్త్రధారణ పురుషులకు ఉద్రేకాలను కలిగిస్తుందని ఆయన అన్నారు. 

ఆయన మాటలమీద విమర్శలు రావడంతో తను చేసిన వ్యాఖ్యలమీద మహిళలకు క్షమాపణలు చెప్పారు. స్త్రీలను అవమానించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని తెలిపారు. ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలు.. మహిళలను అవమానించేలా ఉన్నాయని అన్నారు. ఆమె మహిళలకు క్షమాపణలు చెప్పాలని రేణుకాచార్య డిమాండ్ చేశారు. 

ఇదిలా ఉండగా, కర్నాటకలో రాజుకున్న హిజాబ్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కాడంతో పాటు కర్నాటక రాష్ట్రంలోనే కాకుండా మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలకు పాకింది. 
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందిస్తూ... 
బికినీ, గూంగట్, జీన్స్ ఏం వేసుకున్నా.. హిజాబ్ ధరించినా.. అది మహిళల హక్కు అని ప్రియాంక అన్నారు. వస్త్రధారణ నెపంతో మ‌హిళ‌ల‌ను వేధించ‌డం ఆపేయాల‌ని, నచ్చిన దుస్తుల్ని ధరించడం మహిళల హక్కు అని ఆమె స్ప‌ష్టం చేశారు. 

కర్ణాటక లో క్లాస్ రూంలలో హిజాబ్ వేసుకోకుండా నిషేధించిన కళాశాల విద్యార్థులకు మద్ధతుగా ఆమె మాట్లాడారు. ఏ బట్టలు ధరించాలనే ఎంపిక వారిదేననీ, ఈ హక్కు రాజ్యాంగం ద్వారా క‌ల్పించ‌బ‌డిందంటూ ప్రియాంక గాంధీ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. "అది బికనీ అయినా, గూంగట్ అయినా, ఒక జీన్స్ అయినా... లేదా హిజాబ్ అయినా, తాను ఏమి ధరించాలో నిర్ణయించుకోవడం మహిళల హక్కు. ఈ హక్కు భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇచ్చిన హక్కు. మహిళలను వేధించడం ఆపండి" అని  ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. అంతేకాదు #ladkihoonladsaktihoon అనే హ్యాష్‌ట్యాగ్ ను త‌న ట్వీట్ కు జోడించారు. 

ఈ ట్వీట్ మీద కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ సైతం తన సోదరి ట్వీట్ మీద 'థంబ్స్-అప్' ఎమోజీతో స్పందించారు. కాగా, ఈ రోజు నుంచి ఏడు దశల్లో యూపీ యూపీ ఎన్నిక‌లు ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే #ladkihoonladsaktihoon ప్ర‌చారంలో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా మహిళా హక్కులు, మ‌హిళా సాధికారతపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు  అనేక అంశాల‌ను లేవ‌నెత్తింది. మ‌హిళా హ‌క్కుల‌ను అంశాన్ని ప్రియాంక గాంధీ ప్ర‌స్తావిస్తూ.. ఎన్నిక‌ల ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు.  

కాగా, గత వారం రోజుల నుంచి కర్నాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. ఉడిపి జిల్లాలో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధ‌రించి క్లాస్‌రూమ్‌కు వెళ్ల‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం అవుతున్నది.  ఆ రాష్ట్ర విద్యార్థులు కాషాయ కండువాల‌ను ధ‌రిస్తూ కాలేజీల‌కు వెళ్ల‌డం వివాదంగా మారింది. దీంతో క‌ర్నాట‌క‌లో ప్ర‌స్తుతం ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప్రస్తుతం హిజాబ్, కాషాయ ఖండువాల వివాదం ఇతర రాష్ట్రాలకు సైతం పాకుతున్నది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?