ఓటర్లకు రెస్టారెంట్స్ బంపర్ ఆఫర్.. సూపర్ డిస్కౌంట్

Published : Nov 28, 2018, 02:04 PM IST
ఓటర్లకు రెస్టారెంట్స్ బంపర్ ఆఫర్.. సూపర్ డిస్కౌంట్

సారాంశం

ఓటర్లను చైతన్య పరిచేందుకు రెస్టారెంట్ యజమానులు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసిందే.

ఓటర్లను చైతన్య పరిచేందుకు రెస్టారెంట్ యజమానులు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా, ఓటింగ్ శాతం పెంచేందుకు కొన్ని రెస్టారెంట్లు వినూత్న పథకాన్ని అవలంభిస్తున్నారు. 

ఓటు వేసిన వారి ఎడమచేతి చూపుడువేలుకి సిరా గుర్తు పెడతారన్న విషయం మనకు తెలిసిందే. అయితే...ఆ సిరా గుర్తు చూపించి.. మా రెస్టారెంట్ లో రెండు రోజుల పాటు 10శాతం డిస్కౌంట్ తో భోజనం చేయవచ్చని  భోపాల్ లోని రెస్టారెంట్ యజమానులు ఆఫర్ చేస్తున్నారు.

‘‘ మీ ఓటుకి లెక్కలోకి వస్తుంది. మీ ఓటు మార్కుని చూపించి రెండు రోజుల పాటు 10శాతం డిస్కౌంట్ పొందండి’’ అంటూ రెస్టారెంట్ ముందు బోర్డులు ఏర్పాటు  చేశారు.  కేవలం రెస్టారెంట్ యజమానులు మాత్రమే కాదు.. కొందరు బార్బర్ షాప్ యజమానులు కూడా ఈ రకం ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

ఓ బార్బర్ షాప్ యజమాని.. ఓటు వేసిన ఓటర్లందరికీ  ఉచితంగా షేవింగ్ చేస్తానని ప్రకటించాడు. మరి ఇలా ఉచితంగా షేవింగ్ చేస్తే నీకు నష్టం వస్తుంది కదా అని ఎవరైనా అడిగితే... ‘దేశ ప్రగతి మార్గంలో పయనించడమే నా అసలు లక్ష్యం..’’ అంటూ సమాధానం చెప్పాడు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !