అలోపతిపై వ్యాఖ్యలు: హర్షవర్ధన్ ఆగ్రహం, వెనక్కి తగ్గిన రామ్ దేవ్ బాబా

By telugu team  |  First Published May 24, 2021, 8:32 AM IST

ఆలోపతి వైద్యంపై తాను చేసిన వ్యాఖ్యలను రామ్ దేవ్ బాబా వెనక్కి తీసుకున్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రామ్ దేవ్ బాబాకు లేఖ రాశారు. దాంతో ఆయన వెనక్కి తగ్గారు.


న్యూఢిల్లీ: ఆలోపతి వైద్యానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రామ్ దేవ్ బాబా వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ట్విటర్ వేదికగా ఆయన ఆ విషయం తెలిపారు. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలోపతి వైద్యులను అవమానించే విధంగా రామ్ దేవ్ బాబా మాట్లాడారని భారత వైద్య సంఘం (ఐఎంఎ) విరుచుకుపడింది. దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే స్పందించింది. ఆయనపై కేసు నమోదు చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. 

Latest Videos

అలోపతి వైద్యులపై రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను మంత్రి హర్షవర్ధన్ ఖండించారు. వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచిస్తూ ఆయన రామ్ దేవ్ బాబాకు ఓ లేఖ రాశారు. దాంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ రామ్ దేవ్ బాబా ట్వీట్ చేశారు. హర్షవర్ధన్ ను ఉద్దేశిస్తూ తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకున్నారు. 

"మీ లేఖ నాకు అందింది. వైద్య విధానాలపై నేను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తన్నారు నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను" అని రామ్ దేవ్ బాబా ట్వీట్ చేశారు.

ఆధునిక వైద్యం వల్ల ఎక్కువ మంది చనిపోయారని రామ్ దేవ్ బాబా వ్యాఖ్యానించారు.  హర్షవర్ధన్ కు ట్వీట్ చేస్తూ విచారం వ్యక్తం చేసిన 8 నిమిషాల తర్వాత రామ్ దేవ్ బాబు మరో ట్వీట్ చేశారు. యోగా, ఆయుర్వేదం పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని, ఆధునిక వైద్య శాస్త్రానికి పరిమతులు ఉన్నాయని ఆయన అన్నారు. 

click me!