మహిళ తో వివాదం.. స్టేషన్ కి పిలిపించి మూత్రం తాగించి..

Published : May 24, 2021, 07:31 AM IST
మహిళ తో వివాదం.. స్టేషన్ కి పిలిపించి మూత్రం తాగించి..

సారాంశం

ఓ యువకుడి పట్ల పోలీసు అధికారులు దారుణంగా ప్రవర్తించారు. బలవంతంగా పోలీస్ స్టేషన్ లో మూత్రం తాగించారు


ఓ మహిళతో వివాదం విషయంలో.. ఓ యువకుడి పట్ల పోలీసు అధికారులు దారుణంగా ప్రవర్తించారు. బలవంతంగా పోలీస్ స్టేషన్ లో మూత్రం తాగించారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటనలో బాధిత యువకుడు దళితుడు కావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ మహిళ ఫోన్ కాల్ కు సంబంధించిన వివాదంలో గోనిబీదు ఎస్సై అర్జున్ తనను పోలీస్ స్టేషన్ కు రప్పించి.. చిత్రహింసలు పెట్టారని ఓ దళిత యువకుడు ఆరోపించాడు. తనతో బలవంతంగా మూత్రం కూడా తాగించారని ఆ యువకుడు ఆరోపించాడు.

ఈ ఘటనపై దళిత సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి.ఎస్సై అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపిన చిక్కమంగళూరు ఎస్పీ అక్షయ్... అర్జున్ ని బదిలీ చేశామని చెప్పారు. కాగా.. ఇలాంటి సంఘటన అమానవీయమైనవంటూ కాంగ్రెస్ నేత దినేశ్ గుండూరావు ట్వీట్ చేశారు. కాగా...  ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం