శశిథరూర్‌కే ఇంగ్లీష్ పాఠాలా? ట్విట్టర్‌లో రామ్‌దాస్ అథవాలే ఇంగ్లీష్ లెస్సన్స్

Published : Feb 11, 2022, 03:16 PM IST
శశిథరూర్‌కే ఇంగ్లీష్ పాఠాలా? ట్విట్టర్‌లో రామ్‌దాస్ అథవాలే ఇంగ్లీష్ లెస్సన్స్

సారాంశం

కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే.. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కే ఇంగ్లీష్ పాఠాలు నేర్పారు. బడ్జెట్, రిప్లై స్పెల్లింగ్‌లను శశిథరూర్‌కు ట్విట్టర్‌లో చెప్పారు. ఈ విషయాన్ని శశి ధ్రువీకరించారు. బ్యాడ్ ఇంగ్లీష్  కంటే.. కేర్ లెస్ టైపింగే పాపమని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్‌ బడ్జెట్ స్పీచ్‌పై శశి కామెంట్ చేస్తూ ఈ పొరపాటు చేశారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) గురించి తెలిసిన వారికి కచ్చితంగా ఆయన ఇంగ్లీష్ పద సంపద గురించి తెలిసే ఉంటుంది. ఒక్కోసారి ఆయన ట్వీట్లు చదవడానికి డిక్షనరీలు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన వాడే పదాలు, భాష సామాన్యులకు చాలా కష్టంగా అర్థం అవుతుంది. ఆంగ్ల భాషపై శశిథరూర్‌కు అంత పట్టు ఉన్నది. అలాంటి శశిథరూర్‌కే ఇంగ్లీష్ పాఠాలు చెప్పారు మన మంత్రివర్యులు రామ్‌దాస్ అథవాలే(Ramdas Athawale). ట్విట్టర్ వేదికగా శశిథరూర్‌కు ఆయన ఇంగ్లీష్ లెసెన్స్(English Lessons) చెప్పారు. దీనిపై ట్విట్టర యూజర్లు తెగ రియాక్ట్ అవుతున్నారు.

కాంగ్రెస్ నేత శశిథరూర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ట్విట్టర్‌లో విమర్శలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై బడ్జెట్‌లో ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్లపై కామెంట్ చేశారు. నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు వెనకే ట్రెజరీ బెంచ్‌లో కూర్చున్న కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే.. ఆశ్చర్యచకితుడై చూస్తున్నట్టు ఒక చిత్రం ఉన్నది. ఆ చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేస్తు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై విమర్శలు చేశారు. బడ్జెట్‌లో భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ట్రెజరీ బెంచ్ సభ్యులకే నమ్మశక్యంగా లేవని శశిథరూర్ ఆ ఫొటోను జత చేసి ట్వీట్ చేశారు.

అయితే, శశిథరూర్ తన కామెంట్‌లో బడ్జెట్, రిప్లై స్పెల్లింగ్‌లు తప్పుగా రాశారు. ఈ తప్పును కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆధారంగా చేసుకుని శశిథరూర్‌కు కౌంటర్ ఇచ్చారు. అనవసరమైన కామెంట్లు చేసేటప్పుడు చాలా మంది పొరబడుతారని పెద్దలు చెబుతుంటారని ఆయన చురకలు అంటించారు. ఇదే సందర్భంగా ఆయన బడ్జెట్ స్పెలింగ్, రిప్లై స్పెల్లింగ్ ఇవీ అని శశిథరూర్‌కు క్లాస్ ఇచ్చారు. ఇది ఇంతటితో ఆగిపోలేదు. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ట్వీట్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మళ్లీ రియాక్ట్ అయ్యారు.

బ్యాడ్ ఇంగ్లీష్ కంటే కూడా కేర్ లెస్ టైపింగ్ అనేది మహా పాపం అని శశిథరూర్ తన రిప్లైలో పేర్కొన్నారు. అయితే, మీరు బోధిస్తున్నారు కాబట్టి.. మీ ద్వారా నేర్చుకోవడానికి జేఎన్‌యూలో ఒకరు ఉన్నారు అంటూ నర్మగర్భంగా విమర్శలు చేశారు. అయితే, ఆ జేఎన్‌యూ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని ట్విట్టర్ యూజర్లు ఇట్టే పసిగట్టారు. జేఎన్‌యూకు కొత్తగా ఎంపికైన వీసీ శాంతి శ్రీ దూళిపాడి పండిత్‌ను టార్గెట్ చేసుకునే శశిథరూర్ కామెంట్.. చేసినట్టు యూజర్లు కామెంట్లు చేశారు. ఆమె ఇటవలే ఛందస్సు పరమైన దోషాలతో ఆమె ఇటీవలే వార్తల్లోకి ఎక్కారు. కాబట్టి, ఆమెనే లక్ష్యం చేసుకుని శశిథరూర్ కామెంట్ చేశారని అభిప్రాయాలు వచ్చాయి.

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే