మహాభారతం, రామాయణం "కల్పితం" అని విద్యార్థులకు ఓ టీచర్ బోధిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే వేద్యస్ కామత్, ఆయన అనుచరులు ఆరోపించారు.
బెంగళూరు : మహాభారతం, రామాయణాలు.. ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందో ప్రైమరీ స్కూల్ టీచర్. దీంతో రైట్‌వింగ్ గ్రూపు తీవ్ర ఆందోళనలు చేపట్టింది. అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని మంగళూరు, పాఠశాలలో పనిచేస్తున్న ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.
కోస్టల్ టౌన్‌లోని సెయింట్ గెరోసా ఇంగ్లీష్ హెచ్‌ఆర్ ప్రైమరీ స్కూల్‌కు చెందిన ఈ టీచర్ పిల్లలకు.. మహాభారతం, రామాయణాలు "కల్పితం" అని బోధించారని బిజెపి ఎమ్మెల్యే వేద్యస్ కామత్, అనుచరులు ఆరోపించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూడా టీచర్ మాట్లాడారని వారు ఆరోపించారు.
undefined
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ 2002 గోద్రా అల్లర్లు, బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసును టీచర్ ప్రస్తావించారని బృందం ఆరోపించింది. ఆమె "పిల్లల మనస్సులలో ద్వేష భావాలను ప్రేరేపించడానికి" ప్రయత్నిస్తోందని బృందం ఫిర్యాదులో పేర్కొంది.
త్వరలో ప్రధాని మోడీ దుబాయ్ పర్యటన.. ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతం..
టీచర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కూడా నిరసనలు చేపట్టగా, సోమవారం బీజేపీ ఎమ్మెల్యే కూడా వారితో కలసి నిరసన తెలిపారు. ఈ సమయంలో వారు స్కూలు యాజమాన్యంతో మాట్లాడుతూ.. "అలాంటి టీచర్‌కి మద్దతు ఎందుకు ఇస్తున్నారు. మీ నైతికత ఏమైంది? ఆ టీచర్‌ని ఎందుకు ఉంచుకుంటున్నారు? మీరు ఆరాధించే జీసస్ శాంతిని కోరుకుంటాడు. మీ సోదరీమణులు మా హిందూ పిల్లలను బిందీలు పెట్టుకోవద్దని, పూలు, కాలిపట్టీలు ధరించవద్దని చెబుతున్నారు. రాముడికి పాలాభిషేకం చేయడం వేస్ట్ అని చెబుతున్నారు. ఎవరైనా మీ నమ్మకాన్ని అవమానిస్తే మీరు మౌనంగా ఉంటారా?" అని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు.
7వ తరగతి విద్యార్థులకు రాముడు "పౌరాణిక జీవి" అని టీచర్ బోధించిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (డీడీపీఐ) కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆరోపణలు రావడంతో పాఠశాల సదరు టీచ్ ను తొలగించింది.
"సెయింట్ గెరోసా పాఠశాలకు 60 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఈ దురదృష్టకర సంఘటన మా మీద తాత్కాలికంగా అపనమ్మకాన్ని సృష్టించింది. మీ సహకారంతో ఈ నమ్మకాన్ని పునరుద్దరించుకోవడానికి సహాయపడుతుంది. మనమంతా కలిసి విద్యార్థుల భవిష్యత్తు కోసం మెరుగ్గా పని చేద్దాం" అని పాఠశాల లేఖలో పేర్కొంది. ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు కాలేదు.