రాముడు ప్రతీ రోజు మధ్యాహ్నం సీతతో కలిసి వైన్ తాగేవాడు : హేతువాది కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

By team teluguFirst Published Jan 21, 2023, 8:57 AM IST
Highlights

ప్రముఖ హేతువాది, రచయిత కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు ప్రతీ రోజు సీతతో కలిసి మధ్యాహ్నం సమయంలో వైన్ తాగేవారని అన్నారు. 2019లో కూడా ఒక సారి ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 

రాముడు ప్రతీ రోజు మధ్యాహ్నం తన భార్య సీతతో కలిసి కూర్చుని వైన్ తాగేవాడని ‘వాల్మీకి రామాయణం’ చెబుతోందని ప్రముఖ రచయిత, హేతువాది కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్నం సీతతో కూర్చుని ద్రాక్షారసం సేవించడం రాముడి ప్రధాన కార్యకలాపంమని, ఇది తాను చెప్పడం లేదని, ఆ పత్రాలు చెబుతున్నాయని అన్నారు. జనవరి 20వ తేదీన కర్ణాటకలోని మాండ్యాలో జరిగిన కార్యక్రమంలో భగవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కేరళలో విషాదం.. వెయ్యి సొరంగాలు తవ్వి నీటి ఎద్దడి తీర్చిన వ్యక్తి ఆత్మహత్య..

కేఎస్ భగవాన్ శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 లో కూడా ఆయన ఇలానే మాట్లాడారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు మత్తు పదార్థాలు తాగేవాడని, సీతను కూడా తాగేలా చేశాడని పేర్కొంటూ అప్పట్లో పెద్ద వివాదానికి తెరలేపారు. ఆయన రాసిన 'రామ మందిర యాకే బేడా' పుస్తకంలో ఈ విషయాలను పేర్కొన్నారు.

నమ్మి ఇంటి తాళాలు చేతికి ఇస్తే.. మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారం.. పొరుగువారు ధైర్యం చెప్పడంతో

దీనిపై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేఎస్ భగవాన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆ సంఘాలు కువెంపునగర్ లోని రచయిత ఇంటి ముందు హిందూ సంఘం నాయకుడు నిశాంత్ నేతృత్వంలో పూజలు చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో భగవాన్ నివాసం వెలుపల ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేయాల్సి వచ్చింది. హిందూ దేవుళ్లపై రచయిత చేసిన వ్యాఖ్యలు సమాజ శాంతికి భంగం కలిగించాయని నిశాంత్ పేర్కొన్నారు.

156 గ్రాములతో ప్రధాని మోడీ బంగారు విగ్రహం.. అభిమానం చాటిన సూరత్ వ్యాపారి

‘‘వాల్మీకి రామాయణంలోని చివరి అధ్యాయమైన ఉత్తర కాండలోని శ్లోకాలను భగవాన్ తన ‘రామ మందిర యాకే బేడ’ పుస్తకంలో పేర్కొన్నప్పటికీ, వాల్మీకి ఈ అధ్యాయాన్ని రాయలేదని మేము నమ్ముతున్నాం. హిందువులు ఉత్తర కాండతో ఏకీభవించరని ఆయన తెలుసుకోవాలి. రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాల్లో ఉత్తర కాండ ప్రస్తావన లేదు’’ అని నిశాంత్ తెలిపారు.

click me!