జ్ఞానవాపి కేసు‌పై కోర్టు కీలక నిర్ణయం.. హిందూ మహిళల పిటిషన్ విచారణకు అంగీకారం

By Sumanth KanukulaFirst Published Sep 12, 2022, 2:52 PM IST
Highlights

జ్ఞాన్‌వాపి కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో ఉన్న హిందూ దేవతల విగ్రహాల నిత్య దర్శనం, పూజలు చేసుకునేందుకు హక్కు కల్పించాలంటూ  హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు వారణాసిలోని కోర్టు  అంగీకరించింది.

జ్ఞాన్‌వాపి కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లో ఉన్న హిందూ దేవతల విగ్రహాల నిత్య దర్శనం, పూజలు చేసుకునేందుకు హక్కు కల్పించాలంటూ  హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు వారణాసిలోని కోర్టు  అంగీకరించింది. ముస్లిం పక్షం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. హిందూ సంఘాల పిటిషన్‌ను అనుమతించిన కోర్టు.. ఈ అంశం విచారణకు విలువైనదని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 22క వాయిదా వేసింది. 

కాశీ విశ్వనాథ ఆలయం పక్కన ఉన్న మసీదు సముదాయం వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులను పూజించేందుకు అనుమతి కోరుతూ మహిళలు గతంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలసిందే.  ఈ క్రమంలోనే ప్రత్యేక కమిటీ సర్వే నిర్వహించి మరీ వివరాలు సేకరించింది. దేశవ్యాప్తంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 

ఇక, ఈ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారణాసి జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుపై అన్ని పక్షాల వాదనలు ఆగస్టు 24న పూర్తయ్యాయి. ఇక, వారణాసి జిల్లా కోర్టు తీర్పును సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో వారణాసిలో హైఅలర్ట్ ప్రకటించారు. భారీగా భద్రతా బలగాలను మోహరించారు. నగరంలో 144 సెక్షన్ విధించారు.

click me!