
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న కాంగ్రెస్ వాదనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో తమ (కాంగ్రెస్) ప్రభుత్వాలు ఎలా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన బహిరంగ సభల్లో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1975 జూన్ 25న కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీని దేశానికి బ్లాక్ డేగా పేర్కొన్నారు.
1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజాస్వామ్యం గొంతు నొక్కే రోజు ఈరోజు అని, అయితే బీజేపీ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయనీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్‌లలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయని ప్రశ్నించారు. నేటీకి ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొచ్చాయనీ, లక్షలాది మంది నాయకులను ఎత్తుకెళ్లి జైల్లో పెట్టిన ఎమర్జెన్సీ ఎప్పటికీ చీకటి అధ్యాయంగా గుర్తుండిపోతుందన్నారు. ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నేను కూడా అప్పట్లో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అప్పటికి నా వయసు 23 ఏళ్లు. నన్ను రెండున్నర నెలలపాటు జైల్లో ఐసోలేషన్ వార్డులో ఉంచారు. 16 నెలలు జైలులో ఉన్న తర్వాత బయటకు వచ్చాను అని తెలిపారు.
విపక్షాల భేటీపై రాజ్‌నాథ్ ఏం చెప్పారు?
కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్ష పార్టీలపై దాడి చేస్తూ.. ప్రధాని మోడీని ఎలాగైనా అధికారం నుండి దించాలనే అజెండాతో ప్రతిపక్ష పార్టీల సమావేశం పిలిచారని అన్నారు. ప్రపంచ దేశాలు ప్రధాని గౌరవిస్తుంటే.. ఆయనను దగ్గేదించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఆర్థిక పరంగా 2014లో 11వ స్థానంలో ఉన్న భారత్ నేడు ప్రపంచంలో ఐదో స్థానంలో నిలిచిందని, ఈ ఘనత బీజేపీ వల్లనే సాధ్యమైందని అన్నారు.
ఇంకా, ప్రతిపక్షాల ఐక్యతపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు అధికార మత్తులో కూరుకుపోయాయని, అందుకే ప్రధాని మోదీపై కుట్రలు చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కే పని కాంగ్రెస్ చేసిందన్నది నిజం. 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రజలను జైళ్లలో పెట్టారని విమర్శించారు.
మోదీ ప్రభుత్వ పథకాలకు ప్రశంసలు
ప్రతి ఇంటికి కుళాయి నీరు, ఉచిత రేషన్ , ఇతర సంక్షేమ పథకాలతో కూడిన ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ పథకాలను ఆయన ప్రశంసించారు. బీజేపీ ఏది చెబితే అది చేస్తుందని, ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తోందని అన్నారు.