
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మంగోలియన్ దేశాధినేతలతో సమావేశం అయ్యారు. ఆ దేశాధ్యక్షుడు ఉఖ్‌నాగిన్ ఖురేల్‌సుఖ్‌తో పాటు అగ్ర నాయకత్వాన్ని కలుసుకున్నారు. రెండు దేశాల మధ్య బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేసే మార్గాలపై చర్చించారు.
ప్రాంతీయ భద్రతా మాతృక, భౌగోళిక-రాజకీయ గందరగోళం నేపథ్యంలో రెండు దేశాలతో భారతదేశం వ్యూహాత్మక, రక్షణ సంబంధాలను విస్తరించే లక్ష్యంతో రక్షణ మంత్రి సింగ్ మంగోలియా, జపాన్‌లలో ఆయన ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటన సోమవారం ప్రారంభమైంది. అయితే 7వ తేదీ వరకు ఆయన ఆదేశంలోనే ఉండనున్నారు. కాగా మంగోలియాలో ఒక భారత రక్షణ మంత్రిని సందర్శించడం ఇదే తొలిసారి.
పీఎం శ్రీయోజనతో ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించడానికి వందేండ్లు కావాలి: కేజ్రీవాల్ విమర్శలు
ఆ దేశ అధ్యక్షుడితో సమావేశానికి సంబంధించిన ఫొటోలను రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘మంగోలియా అధ్యక్షుడు HE U ఖురేల్‌సుఖ్‌తో ఉలాన్‌బాతర్‌లో అద్భుతమైన సమావేశం జరిగింది. 2018లో ఆయన దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో చివరిగా సమావేశం అయ్యాను. మంగోలియాతో మా బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము ’’ అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
‘‘ మంగోలియన్ పార్లమెంట్ స్పీకర్, మిస్టర్ జండాన్‌షాటర్‌తో సంభాషించడం ఆనందంగా ఉంది. బౌద్ధమతం మా భాగస్వామ్య వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, విస్తరించడానికి అతని స్థిరమైన మద్దతుకు నా అభినందనలు ’’ అని ఆయన మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా.. అంతకు ముందు రాజనాథ్ సింగ్, మంగోలియన్ కౌంటర్ సైఖన్‌బయార్ గుర్సెద్ లు భారత్-మంగోలియా రక్షణ సహకారంపై లోతైన చర్చలు జరిపారు. ‘‘ మొట్ట మొదటిసారిగా మంగోలియా పర్యటనకు వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌కు గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. మంగోలియన్ రక్షణ మంత్రి జనరల్ సైఖన్‌బయార్ తో రక్షణ సహకారాన్ని తీవ్రతరం చేయడానికి, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి విస్తృత చర్చలు జరిపారు ’’ అని ఉలాన్ భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రేపటి (బుధవారం) నుంచి జపాన్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. అక్కడ జపాన్ దేశాల ప్రతినిధులతో ఇద్దరూ చర్చలు జరుపుతారు. ఇది భారత్, జపాన్ మధ్య జరిగే రెండో 2+2 మంత్రుల సంభాషణ. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో ఇద్దరు మంత్రులు జపాన్ మంత్రులతో వ్యూహాత్మక చర్చలు జరుపుతారు. ఈ సమాచారాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం అనుమతి..
రాజ్‌నాథ్ సింగ్ జపాన్ విదేశాంగ మంత్రి యసుకాజు హమాదాతో భేటీ కానుండగా, జైశంకర్ జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషితో భేటీ కానున్నారు. భారత రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి సెప్టెంబర్ 7 నుండి 10 వరకు జపాన్‌లో ఉంటారు. భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత్‌ను సందర్శించిన ఐదు నెలల తర్వాత ఈ సంభాషణ జరుగుతోంది.