Rajnath Singh Jammu Visit: జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్

Published : Jun 17, 2022, 10:41 PM IST
Rajnath Singh Jammu Visit:  జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్

సారాంశం

Rajnath Singh Jammu Visit: ఇటీవలే జమ్ముకాశ్మీర్‌లో పునర్వవిభజన ప్రక్రియ పూర్తయిందని, కాశ్మీర్‌లో 47 స్థానాలు, జమ్ములో స్థానాలు 43 నుంచి 90కి పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.  

Rajnath Singh Jammu Visit: జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది చివరలో నిర్వహించే అవకాశముందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం సూచనప్రాయంగా వెల్లడించారు. జ‌మ్మూకాశ్మీర్లో రెండు రోజుల పర్య‌ట‌న‌లో ఉన్నారు. శుక్రవారం జమ్ములోని పహల్గామ్‌ రిసార్ట్‌లోని జవహర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటనీరింగ్‌ అండ్‌ వింటర్‌ స్పోర్ట్స్‌లోని హిమాలయన్‌ మ్యూజియాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. జమ్ముకాశ్మీర్‌లో పునర్వవిభజన ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని, కాశ్మీర్‌లో 47 అసెంబ్లీ స్థానాలు, జమ్మూలో 43 సీట్లతో మొత్తం 90 సీట్లకు చేరుకుందని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రక్షణ మంత్రి తెలిపారు.
 
రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్‌లో తన రెండు రోజుల పర్యటనలో రెండవ రోజు మహారాజా గులాబ్ సింగ్ 200వ పట్టాభిషేక వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు  గుప్పించారు. ఈ ఏడాది చివరిలో జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతాయని సూచించారు. పీఓకే, గిల్గిత్-బాల్టిస్థాన్‌లు పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలో ఉన్నాయి. విలీనమైన తర్వాత జమ్మూ కాశ్మీర్‌తో సవతి తల్లిగా వ్యవహరించి ఉండకపోతే వేర్పాటువాద శక్తి ఇంత బలంగా ఉండేది కాదనీ,  ఇక్కడ ద్వేష బీజాలు నాటడంలో పాక్ కీల‌క ప్రాత పోషిస్తుందని ఆరోపించారు.బహుశా ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అన్నారు. 

ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో గత 70 ఏళ్లలో కుటుంబ, లంచగొండి, వేర్పాటువాద యుగం చూశామని, అయితే 2019 తర్వాత జమ్మూకశ్మీర్ ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. అదే సమయంలో, జమ్మూ కాశ్మీర్‌కు వచ్చే ప్రతి యాత్రికుడు ఇక్కడ వ్యవస్థాపక రాజు గురించి తెలుసుకోవాలనే లక్ష్యంతో ఇటీవల జమ్మూ కాశ్మీర్ ప్రవేశ ద్వారం లఖన్‌పూర్‌లో మహారాజా గులాబ్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ కార్యక్ర‌మంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డాక్టర్ జితేంద్ర సింగ్, డాక్టర్ కరణ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలంతా జమ్మూకశ్మీర్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?