Rajiv Gandhi Assassination Case: నన్ను కూడా విడుదల చేయండి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నళిని

By Mahesh KFirst Published Aug 11, 2022, 6:47 PM IST
Highlights

రాజీవ్ గాంధీ హత్య కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని ఈ కేసులో దోషి నళిని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పెరారివాలన్ ఈ కేసు నుంచి సుప్రీంకోర్టు జోక్యంతో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు నళిని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
 

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నుంచి పెరారివాలన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ కేసు నుంచి ఆయన విముక్తి పొందాడు. అతనిలాగే.. తననూ విడుదల చేయలని కోరింది. ఈ పిటిషన్ విచారణ జరుగుతుండగా.. తనకు బెయిల్ ఇవ్వాలని కూడా అభ్యర్థించింది.

రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినితోపాటు మరో ఆరుగురు దోషులుగా తేలారు. అందులో ఒకరు పెరారివాలన్. ఈయన 31 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే సుప్రీంకోర్టు జోక్యంతో విడుదలయ్యారు. 

నళిని, ఆమె భర్త మురుగన్, సంథాన్, జయకుమార్, పెరారివాలన్, రవిచంద్రన్, రాబర్ట్ పియూస్‌లు రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు. 

పెరారివాలన్ క్షమాభిక్ష కోసం చేసిన పిటిషన్‌ను తమిళనాడు గవర్నర్ కొన్నేళ్లపాటు తన వద్దే ఉంచుకున్నారు. ఆ క్షమాభిపక్ష పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆ కాలం అంతా పెరారివాలన్ జైలులోనే గడిపాడు. పెరారివాలన్ క్షమాభిక్ష పిటిషన్‌ను అంతులేని జాప్యం చేసే అధికారం తమిళనాడు గవర్నర్‌కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనంతరం, పెరారివాలన్‌ను ఈ కేసు నుంచి విముక్తి చేస్తూ నిర్ణయం తెలిపింది. 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారానికి తమిళనాడు వెళ్లినప్పుడు హత్యకు గురయ్యారు. ఎల్‌టీటీఈ బాంబర్ ఆయన హత్యకు పాల్పడ్డారు. `1991 మే నెలలో శ్రీపెరుంబుదూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది.

click me!