
జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తున్న వేళ ఈ తరహా ఎన్నికలకు జై కొట్టారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న రజనీ.. కొత్త పార్టీ ప్రకటించునున్నారు.. ఈ నేపథ్యంలో కాబోయే రాజకీయ నేతగా ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నిక’ ప్రతిపాదనకు ఆయన తన మద్ధతు ప్రకటించారు. జమిలి ఎన్నికలు మంచి ఆలోచన.. ఇందువల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని రజనీ అన్నారు.
‘ఒక దేశం- ఒకేసారి ఎన్నిక’ విధానంలో భాగంగా పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా పలు రాజకీయ పార్టీలతో కేంద్ర న్యాయశాఖ పలు విడతలుగా సమావేశమైంది. అన్నాడీఎంకే, టీఆర్ఎస్, జేడీయూ వంటి పార్టీలు జమిలి ఎన్నికలకు అంగీకారం తెలపగా.. డీఎంకే, టీడీపీ, టీఎంసీలు ఈ విధానాన్ని తప్పుబట్టాయి..