ప్రధాని సీరియస్ స్పీచ్... స్టేజ్‌పైనే గురకలు పెట్టిన బీజేపీ ఎంపీ

sivanagaprasad kodati |  
Published : Sep 24, 2018, 06:13 PM IST
ప్రధాని సీరియస్ స్పీచ్... స్టేజ్‌పైనే గురకలు పెట్టిన బీజేపీ ఎంపీ

సారాంశం

సాక్షాత్తూ ప్రధాన మంత్రి మన పక్కన ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి.. కానీ అవేవీ పట్టించుకోకుండా.. ప్రధాని సమక్షంలో.. వేలాది మంది జనం సమక్షంలో.. వేదికపైనే గురకలు పెట్టి నిద్రపోయాడు ఓ బీజేపీ ఎంపీ

సాక్షాత్తూ ప్రధాన మంత్రి మన పక్కన ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి.. కానీ అవేవీ పట్టించుకోకుండా.. ప్రధాని సమక్షంలో.. వేలాది మంది జనం సమక్షంలో.. వేదికపైనే గురకలు పెట్టి నిద్రపోయాడు ఓ బీజేపీ ఎంపీ..

వివరాల్లోకి వెళితే.. దేశంలోని 50 కోట్ల మంది పేదలకు ఆరోగ్య బీమాను కలిపించేందుకు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘‘ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’’ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ నిన్న జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు. అనంతరం వేదికపై ప్రజలకు ఈ పథకం గురించి వివరిస్తున్నారు.

ఆ సమయంలో బీజేపీ ఎంపీ రవీంద్రరాయ్ కూడా వేదిక మీదే ఉన్నారు.. పక్కన ప్రధాని సీరియస్‌గా ప్రసంగిస్తుండగా.. స్థానిక, జాతీయ మీడియా మొత్తం కవర్ చేస్తోందన్న సంగతి మరచిపోయి.. కునికిపాట్లు తీశారు.

ఆయన తతంగాన్ని సభకు విచ్చేసిన ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతోంది. ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలో సాక్షాత్తూ ఎంపీనే నిద్రపోతే... ఈ పథకం గురించి ఆయన ప్రజలకు ఏం చెబుతారని నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.

PREV
click me!

Recommended Stories

వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..|Trump Next Target Which Country?| AsianetNewsTelugu
Business Ideas : కేవలం రూ.10 వేలు చాలు.. మీ సొంతింట్లోనే ఈ వ్యాపారాలు చేయండి, మంచి ఇన్కమ్ పొందండి