ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన రజినీకాంత్

Published : Dec 03, 2020, 12:42 PM ISTUpdated : Dec 03, 2020, 01:38 PM IST
ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన రజినీకాంత్

సారాంశం

ఎట్టకేలకు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడంపై కొన్నేేళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తెర దించారు. జనవరిలో పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు

చెన్నై: రాజకీయ రంగ ప్రవేశంపై ఎట్టకేలకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టత ఇచ్చారు. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ట్విటర్ వేదికగా ఆ విషయాన్ని రజినీకాంత్ వెల్లడించారు. 

ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన అడుగుపెడుతున్నారు. 2021 శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. డిసెంబర్ 31వ తేదీన పార్టీ వివరాలను వెల్లడిస్తానని ఆయన చెప్పారు. 2021 జనవరిలో పార్టీని స్థాపిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుతో తన అభిమానులకు రజినీకాంత్ నూతన సంవత్సరం బహుమతి ఇవ్వనున్నారు. ఇటీవల ఆయన తన అభిమాన సంఘాల నాయకులతో సమావేశమైన విషయం తెలిసిందే. 

చాలా కాలంగా రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే, ఎప్పటికప్పుడు పార్టీ స్థాపనపై, తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత ఇవ్వకుండా దాటవేస్తూ వస్తున్నారు. తాజాగా, ఆయన తన ప్రత్యక్ష రాజకీయాల పాత్రపై స్పష్టత ఇచ్చారు. మధురైలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ గురించి ప్రకటన చేయాలని అభిమానులు రజినీకాంత్ కు సూచించారు. 

రాజకీయాల్లోకి రాకుంటే మార్పు ఎప్పటికీ సాధ్యం కాదని రజినీకాంత్ అన్నారు. తమిళ ప్రజలపైనే మార్పు ఆధారపడి ఉందని అన్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్నవారందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. తమిళ ప్రజలపైనే మార్పు ఆధారపడి ఉందని అన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే అది తమిళ ప్రజల విజయమని అన్నారు.తమ అభిమానుల సహకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రజినికాంత్ తెలిపారు  రానున్న శాసససభ ఎన్నికల్లో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మారుస్తానని, తమిళనాడును సమూలంగా మారుస్తానని ఆయన చెప్పారు.

తమిళనాడులో మార్పు వస్తుందని రజినీకాంత్ అన్నారు. తమిళనాడును సమూలంగా మార్చడానికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడు కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. తమిళనాడులో మార్పునకు అవకాశం వచ్చిందని చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu