రూ. కోటి కోసం భర్తను చంపిన భార్య

Published : Dec 03, 2020, 11:16 AM IST
రూ. కోటి కోసం భర్తను చంపిన భార్య

సారాంశం

పోలీసులు రోడ్డు ప్రమాదమని కేసు నమోదు చేసి దాన్ని మూసివేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన బీమా సంస్థ ప్రమాదంపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భర్త పేరు మీద కట్టిన రూ.కోటి బీమా డబ్బుల కోసం ఓ మహిళ ఏకంగా కట్టుకున్న భర్తనే అతి కిరాకతంగా హత్య చేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని లాతూరు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా బాభల్ గావ్ గ్రామానికి సమీపంలో 2012వ సంవత్సరంలో అన్నారావు బాన్సోడ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ప్రమాదం కేసు నమోదు చేశారు. పోలీసులు రోడ్డు ప్రమాదమని కేసు నమోదు చేసి దాన్ని మూసివేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన బీమా సంస్థ ప్రమాదంపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తన భర్తపై ఉన్న కోటిరూపాయల బీమా డబ్బు పొందడం కోసం అతని భార్య జ్యోతి బాన్సోడ్, ఇన్స్యూరెన్సు ఏజెంటు రమేష్ వివేకి, అతని స్నేహితుడు గోవింద్ సుబోధిలు కుట్రపన్ని హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసులు కేసు నమోదు చేశారు. బీమా డబ్బు కోసమే అన్నారావును చంపారని తేలడంతో జిల్లా ఎస్పీ నిఖిల్ పింగాలే ఆదేశాల మేర కేసు నమోదు చేసి జ్యోతిని అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Nepal Flash Floods: నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన వందలాది మృ*తదేహాలు | Asianet News Telugu
భారీ వరదల తర్వాత నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి | Drone Visuals | Nepal Flash Floods | From Devi Ghat