మనవడిని కొట్టినందుకు కొడుకు చేతిలో తండ్రి హతం..!

Published : Jul 14, 2021, 04:11 PM ISTUpdated : Jul 14, 2021, 04:12 PM IST
మనవడిని కొట్టినందుకు కొడుకు చేతిలో తండ్రి హతం..!

సారాంశం

వేస్తా అనే వ్యక్తి శనివారంనాడు తన మనవడి(8) అల్లరిని భరించలేక అతని చెంప చెల్లుమనిపించాడు. అయితే ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్న తండ్రి జయంతీలాల్‌ తో బాలుడు జరిగిన విషయాన్ని చెప్పాడు.

జైపూర్ : అల్లరి చేస్తున్న మనవడి చెంపచెల్లుమనిపించిన ఓ వ్యక్తి తన కుమారుడి చేతిలో హత్యకు గురయ్యాడు. నా కుమారిడిపై చేయి చేసుకుంటావా అంటూ నిందితుడు తన తండ్రిని కర్రతో చావబాదాడు. ఆ దెబ్బలకు సొమ్మసిల్లి పోయిన తండ్రి కొద్దిసేపటికే ప్రాణాలు వదిలాడు.  

రాజస్థాన్ లోని జిల్లాలో శనివారం ఈ దారుణం జరిగింది. వేస్తా అనే వ్యక్తి శనివారంనాడు తన మనవడి(8) అల్లరిని భరించలేక అతని చెంప చెల్లుమనిపించాడు. అయితే ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్న తండ్రి జయంతీలాల్‌ తో బాలుడు జరిగిన విషయాన్ని చెప్పాడు.

దీంతో మనవడిని ఎందుకు కొట్టావంటూ జయంతీలాల్‌ తన తండ్రి వెస్తాతో గొడవ పడ్డాడు.  ఈ క్రమంలో వారి మధ్య వివాదం అదుపు తప్పడంతో నిందితుడు తన తండ్రిని కర్రతో కొట్టాడు. దీంతో అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లామని జయంతి లాల్ అనుకున్నాడు. కానీ ఓ రాత్రి వేళ వేస్తా ప్రాణాలు విడిచాడు. కాగా నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం