
Sheep: మామూలుగా గొర్రెలు, మేకలు, పశువుల ధరలు వేలల్లోనే ఉంటాయి. ఇక మేలు జాతికి చెందినవి అయితే.. వాటికి కాస్త డిమాండ్ ఉంది.. వాటి ప్రత్యేకతలను బట్టి .. లక్షల్లో ధర పలికే అవకాశముంటుంది. కానీ.. మీరు ఎప్పడైనా విన్నారా..? ఓ గొర్రె పిల్ల కోటీ రూపాయల ధర పలికిందంటే.. నమ్ముతారా? నమ్మబుద్ది కావడం లేదు కాదా..? మీరు నమ్మిన నమ్మికపోయినా.. రాజస్థాన్‌లోని ఓ గొర్రెపిల్ల రూ.కోటీ ధర పలుకుతోంది. ఇంకో షాకింగ్ విషయమేమింటంటే.. కోట్లలో ధర పలుకుతున్నప్పటికీ ఆ గొర్రెపిల్ల యాజమాని మాత్రం దానిని అమ్మడానికి ఒప్పుకోలేదు. అసలు గొర్రె పిల్లెంటీ..? కోటి రూపాయాల ధర పలకడమేంటీ? అంత ధర పలికి ఆ గొర్రె పిల్ల యాజమాని అమ్మకపోవడమేంటని అనుకుంటున్నారా.. అసలు కథేంటో తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన రాజు సింగ్ అనే వ్యక్తి గొర్రెలు, మేకలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తన గొర్రెల మందలో ఓ గొర్రె పిల్లను చూసిన వ్యక్తి .. ఆ గొర్రెపిల్ల కావాలంటూ.. ఏకంగా రూ.కోటీ రూపాయలు ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. ఆ ఆఫర్ అంగీకరిస్తే.. అతని జీవితం ఒక్క క్షణంలో మారిపోతుంది. తన భవిష్యత్ కూడా చాలా లగ్జరీగా మారిపోతుంది. కానీ ఆ గొర్రెల యాజమాని తన దగ్గరున్న ఆ గొర్రె పిల్లను అమ్మడానికి ఇష్టపడటం లేదు. అతను ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. సమాచారం ప్రకారం.. ఆ గొర్రె పిల్ల వయస్సు 1 సంవత్సరాలు. దాని పొట్ట భాగంలో ఉర్దూ భాషలో 786 ఆకారం ఉంది. దీంతో దీని ప్రాధాన్యత పెరిగింది. ఇస్లాంలో 786 సంఖ్య చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే దాన్ని అమ్మేందుకు నిరాకరిస్తున్నాడు.
మొదటగా అదేంటో తనకు అర్థం కాలేదనీ, ఓ సారి తన గ్రామంలో ఉన్న ముస్లీంలకు దాన్ని చూపించగా.. వారు అది ఉర్దూ భాషలో ఉన్న 786 సంఖ్య అని, అది దేవుడి ఆశీర్వాదమని తెలిపారని రాజు సింగ్ చెప్పుకొచ్చారు. ముస్లీంలు 786 సంఖ్యను పవిత్రంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆ గొర్రెపిల్ల పొట్టభాగంలో 786 ఉందని తెలియడంతో దాన్ని కొనేందుకు చాలా మంది పోటీపడుతున్నారు. దాదాపు రూ.70 లక్షల నుంచి రూ.కోటీ దాకా చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కానీ రాజు సింగ్ మాత్రం వారి ఆఫర్ ను నిరాకరిస్తూ వస్తున్నాడు.
ఈ గొర్రె పిల్ల అంటే.. తనకు చాలా ఇష్టమనీ, దానికి 786 సంఖ్య ఉందని తెలిసినప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు రాజు సింగ్ వెల్లడించాడు. దానికి దానిమ్మ, బొప్పాయి, మిల్లెట్స్, కూరగాయలు ఆహారంగా అందిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక గొర్రె పిల్లకు భారీ ధర పలకడంతో దాన్ని ఎవరూ దొంగిలించకుండా.. ముందు జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు రాజు సింగ్.