Baba Ramdev: రామ్‌దేవ్‌ బాబాకు షాక్.. పోలీసుల ముందు హాజ‌రుకావాలంటూ కోర్టు ఆదేశాలు

Published : Sep 14, 2023, 05:09 PM IST
Baba Ramdev: రామ్‌దేవ్‌ బాబాకు షాక్.. పోలీసుల ముందు హాజ‌రుకావాలంటూ కోర్టు ఆదేశాలు

సారాంశం

Baba Ramdev: విద్వేషపూరిత ప్రసంగాల కేసులో యోగా గురు బాబా రాందేవ్ కు రాజస్థాన్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 2న రాజస్థాన్ లోని బార్మర్ లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో తాను చేసిన ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ రాందేవ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ముస్లింలు తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనీ, హిందూ మహిళలను అపహరించుకుపోతున్నారని ఆరోపిస్తూ ఆయన ప్రసంగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో విద్వేషపూరిత ప్రసంగాల కేసు న‌మోదైంది.  

Baba Ramdev summoned by the Rajasthan High Court: యోగా గురు బాబా రాందేవ్ కు కోర్టు షాకిచ్చింది. విద్వేషపూరిత ప్రసంగాల కేసులో  ఆయ‌న‌కు రాజస్థాన్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 2న రాజస్థాన్ లోని బార్మర్ లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో తాను చేసిన ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ రాందేవ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ముస్లింలు తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనీ, హిందూ మహిళలను అపహరించుకుపోతున్నారని ఆరోపిస్తూ ఆయన ప్రసంగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో విద్వేషపూరిత ప్రసంగాల కేసు న‌మోదైంది.

వివ‌రాల్లోకెళ్తే.. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలపై నమోదైన ఎఫ్ఐఆర్ కు సంబంధించి యోగా గురువు రాందేవ్ బాబాను అక్టోబర్ 5న బార్మర్ లోని ఛోహ్తాన్ పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఆయన అరెస్ట్‌ పై ఇచ్చిన స్టేను అక్టోబర్‌ 16 వరకు పొడిగించింది. కేసు డైరీని అక్టోబర్ 16న కోర్టులో సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించిన హైకోర్టు అప్పటి వరకు ఆయన అరెస్టుపై స్టేను పొడిగించింది. ఐఎఫ్ఆర్ ను రద్దు చేయాలని కోరుతూ బాబా రాందేవ్ దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ కుల్దీప్ మాథుర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు జరిగిన విచారణలో, హైకోర్టు రాందేవ్ అరెస్టుపై స్టే విధించింది. మే 20 లేదా అంతకంటే ముందు విచారణ కోసం దర్యాప్తు అధికారి (ఐఓ) ముందు హాజరు కావాలని ఆదేశించింది. కానీ రాందేవ్ ఈ ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారు.

ఫిబ్రవరి 2న బార్మర్ లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు పథాయ్ ఖాన్ అనే వ్యక్తి ఫిబ్రవరి 5న బార్మర్ లోని చోహ్తాన్ పోలీస్ స్టేషన్ లో రాందేవ్ పై ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టడం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి అభియోగాల కింద ఛోహ్తాన్ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదుచేశారు. ఇస్లాంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా రాందేవ్ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారనీ, ఆయన మాటలు కోట్లాది మంది ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!