రాజస్థాన్ ఎన్నికలు: చంటిబిడ్డను ఎత్తుకుని డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్

Published : Dec 07, 2018, 02:58 PM IST
రాజస్థాన్ ఎన్నికలు: చంటిబిడ్డను ఎత్తుకుని డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్

సారాంశం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జైసల్మేర్ లోని ఓ పోలింగ్ బూత్ వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ మహిళ 5నెలల చంటిబిడ్డను ఒడిలో ఎత్తుకుని విధులు నిర్వహిస్తోంది.   

రాజస్థాన్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జైసల్మేర్ లోని ఓ పోలింగ్ బూత్ వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ మహిళ 5నెలల చంటిబిడ్డను ఒడిలో ఎత్తుకుని విధులు నిర్వహిస్తోంది. 

ఒక వైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు పేగుబంధాన్ని భుజాలపై మోస్తున్న ఆ తల్లిని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. పసిబిడ్డ ఏడుస్తున్నా ఆమె అక్కడే ఉండి  ఆడిస్తుంది. అయితే చంటి బిడ్డ తల్లులను ఇలాంటి ఎన్నికల్లో ఎందుకు డ్యూటీ వేస్తారో అని గుసగుసలు ఆడుకుంటున్నారు. పసిబిడ్డ ఆకలితో ఏడిస్తే ఆ ఉద్యోగి ఎక్కడకు వెళ్లి పాలు ఇవ్వాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. 

ఒక వేళ పక్కకు వెళ్తే డ్యూటీ చెయ్యడం లేదని అధికారుల ఆగ్రహంతో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని విమర్శిస్తున్నారు ఓటర్లు. అయితే ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఐదునెలల చంటి బిడ్డను భుజాలపై ఎత్తుకుని రెండు బాధ్యతలు చూస్తున్న ఆ తల్లికి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఒకవైపు తల్లిగా బిడ్డపై ఉన్న మమకారం, మరోవైపు చిత్తశుద్ధితో డ్యూటీ చెయ్యడంతో అందరి నోటా వావ్ గ్రేట్ అనిపించుకుంటుంది.
 

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations