Omicron: భారత్‌లో ఒమిక్రాన్ తుఫాను.. రాజస్థాన్‌లో కొత్తగా 9 మందికి గుర్తింపు, దేశంలో 21కి చేరిన సంఖ్య

By Siva KodatiFirst Published Dec 5, 2021, 8:25 PM IST
Highlights

భారత్‌లో ఒమిక్రాన్ తుఫాన్ (omicron) ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. రాజస్ధాన్‌లో (rajasthan) కొత్తగా 9 మందిలో ఈ వేరియంట్ నిర్థారణ అయ్యింది. దీంతో ఇండియాలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది.

భారత్‌లో ఒమిక్రాన్ తుఫాన్ (omicron) ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. రాజస్ధాన్‌లో (rajasthan) కొత్తగా 9 మందిలో ఈ వేరియంట్ నిర్థారణ అయ్యింది. దీంతో ఇండియాలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని (jaipur) ఆదర్ష్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని 9మందికి ఈ రకం వేరియంట్‌ వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చినట్లు తెలిపింది. 

అంతకుందు మహారాష్ట్రలో (maharashtra) ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ అయ్యింది. నైజీరియా నుంచి వచ్చిన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆ మహిళ సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ రకం వెలుగుచూసింది. అలాగే ఫిన్లాండ్‌ నుంచి పుణె (pune) వచ్చిన మరో వ్యక్తిలోనూ ఒమిక్రాన్ వైరస్‌ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో 9, మహారాష్ట్రలో 8, కర్ణాటకలో 2, ఢిల్లీ, గుజరాత్‌లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజులోనే 17 కేసులు నమోదు కావడం దేశంలో కలకలం రేపుతోంది. 

ALso Read:Omicron: మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలజడి.. ఒకేసారి 7 కేసులు గుర్తింపు, దేశంలో 12కి చేరిన సంఖ్య

కాగా.. ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. Tanzania నుండి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ సోకిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి Satyendar Jain చెప్పారు. ఢిల్లీలోని LNJP hospital ఆసుపత్రిలో 17 మంది కరోనాతో చేరారని  ఆయన వివరించారు. ఆసుపత్రిలో చేరిన తొమ్మిది మందికి గొంతు నొప్పి, జ్వరంతో బాధపడున్నారు. వీరి నమూనాలను టెస్టింగ్ కోసం పంపినట్టుగా అధికారలు తెలిపారు. ఫలితాలు రావడానికి నాలుగైదు రోజుల సమయం పడుతుంది.

యూకే నుండి ముగ్గురు కొత్త రోగులు ఆసుపత్రుల్లో చేరారని లోక్‌నాయక్ జయప్రకాష్ ఆసుపత్రి సూపరింటెండ్త డాక్టర్ Suresh kumar చెప్పారు. Omicronకేసులు నమోదైన దేశాల నుండి సుమారు 15 మంది రోగులు ఢిల్లీలోని ఎన్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేరారు.Delhiలో కరోనా పాజిటివ్ రేటు 0.08 శాతం పాజిటివ్ రేటుతో 51 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా కేసులు 14,41, 295కి చేరాయి. ఢిల్లీలో కరోనా 14.15 లక్షలకు చేరుకొన్నాయని  ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

click me!