కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి అశోక్ గెహ్లాట్ ఔట్?.. ఢిల్లీలో సీనియర్ నేతలు ఏమంటున్నారంటే?

By Mahesh KFirst Published Sep 26, 2022, 6:50 PM IST
Highlights

కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి అశోక్ గెహ్లాట్ ఔట్ అని ఢిల్లీలోని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ముకుల్ వాస్నిక్, మల్లికార్జున్ ఖర్గే, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్‌లు ఉన్నట్టు వివరించారు. త్వరలోనే శశిథరూర్ కూడా అధ్యక్ష పోస్టు కోసం నామినేష వేయనున్నారు.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి అశోక్ గెహ్లాట్ బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఢిల్లీలోని 10, జన్‌పథ్‌లో రేపు కీలక సమావేశం జరగనున్న సందర్భంలో సీనియర్ పార్టీలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్‌లో నిన్న రాత్రి ఊహించని రీతిలో సంక్షోభం ఏర్పడిన తర్వాత ఈ కామెంట్లు రావడం గమనార్హం. నిన్న రాత్రి అశోక్ గెహ్లాట్ టీమ్‌కు చెందిన సుమారు 80 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు కూలిపోయే దశకు వచ్చింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ రోజు ఇండియా టుడే టీవీతో కీలక విషయాలపై మాట్లాడారు. అశోక్ గెహ్లాట్ వ్యవహరించిన విధానం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అసంతృప్తి తెచ్చిందని వారు అన్నారు. అశోక్ గెహ్లాట్ పట్ల వారు అప్‌సెట్ అయ్యారని పేర్కొన్నారు. 

ఆయన కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి ఔట్ అయ్యారు. ఈ నెల 30వ తేదీలోపు అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు వేసే ఇతర నేతలు ఉన్నారు. ముకుల్ వాస్నిక్, మల్లికార్జున్ ఖర్గే, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్‌లు రేసులో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ఎంపీ వివరించారు.

కాంగ్రెస్ పార్టీకి సరికొత్త ముప్పును ముందుకు తెస్తూ రాజస్తాన్‌లో నిన్న 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. రాజస్తాన్ సీఎం పోస్టుకు సచిన్ పైలట్ అభ్యర్థిత్వంపై నిరసనగా వారు ఈ రాజీనామాలు చేశారు. అశోక్ గెహ్లాట్ ఒక వేళ పార్టీ అధ్యక్షుడిగా గెలిస్తే.. రాజస్తాన్ సీఎం సీటులో సచిన్ పైలట్ మినహా ఇతరులు ఎవరికైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలిచినవారికి ఈ అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

రాజస్తాన్‌లో రాజీనామాల పర్వం కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కలవరం తెచ్చి పెట్టింది. పార్టీ నాయకత్వం వెంటనే సీనియర్ నేతలను జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దడానికి రాజస్తాన్‌కు పంపింది. 

దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత, ప్రభావాన్ని కోల్పోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నది. 2022 ఎన్నికల్లోపు సర్వం సిద్ధం చేసుకుని సమరానికి సై అన్నట్టుగా ఉండాలని నేతలు భావిస్తున్నారు.

click me!