రాజ రాజ చోళుడు హిందువు కాదు: ప్రముఖ తమిళ దర్శకుడి వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్.. వివాదంలోకి కమల్ హాసన్

By Mahesh KFirst Published Oct 6, 2022, 12:44 PM IST
Highlights

పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రం పై జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్న వెట్రిమారన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ రాజ చోళుడు హిందువు కాదని స్పష్టం చేశారు. ఆయనకు బీజేపీ నేత హెచ్ రాజా కౌంటర్ ఇచ్చారు. ఈ తరుణంలో ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్.. దర్శకుడు వెట్రిమారన్‌కు అండగా నిలబడ్డారు.

చెన్నై: జాతీయ అవార్డు పొందిన ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు అయిన పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రంపై ఆయన కామెంట్ చేశారు. ఈ కామెంట్ బీజేపీకి అసంతృప్తి కలిగించింది. అంతేకాదు, ఈ వివాదంలోకి ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా దిగారు. తన అభిప్రాయాన్నీ వెల్లడించారు.

ఓ కార్యక్రమంలో వెట్రిమారన్.. పొన్నియిన్ సెల్వన్ సినిమా గురించి మాట్లాడారు. ‘నిరంతరంగా మా సింబల్స్‌ను మా నుంచి లాక్కుంటున్నారు. వల్లువర్ లేదా రాజ రాజ చోళన్‌ను హిందూ రాజుగా పిలిచి కాషాయీకరణ చేయడం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది’ అని ఆయన అన్నారు. అంతేకాదు, సినిమా అనేది కామన్ మీడియం అని, ఒకరి ప్రాతినిధ్యాన్ని రక్షించుకోవడానికి రాజకీయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని వివరించారు.

రాజ రాజ చోళన్ ప్రేరణగా కల్కి రాసిన కల్పిత నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమా తీశారు. కల్కి రాసిన నవల ఇప్పటికీ తమిళనాట చాలా ఫేమస్. ఆ పెద్ద నవలను మణిరత్నం సినిమాగా తీయాలని కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కాగా, తమిళ వీక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కచ్చితంగా చూసేయాల్సిందే అనే టైపులో రివ్యూలు వచ్చాయి. ఆ సినిమా తమ అస్తిత్వానికి ప్రతీక వంటిదనే వాదనలూ వినిపించాయి. 

అయితే, వెట్రిమారన్ కామెంట్ పై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ నేత హెచ్ రాజా.. వెట్రిమారన్ వ్యాఖ్యలను ఖండించారు. రాజ రాజ చోళన్ హిందూ రాజే అని స్పష్టం చేశారు. ‘వెట్రిమారన్ వలే నాకు చరిత్రపై ఎక్కువ అవగాహన లేదు. కానీ, ఆయనకు ఓ ప్రశ్న వేస్తున్నా.. రాజ రాజ చోళన్ నిర్మించిన రెండు చర్చీలు లేదా మసీదులు చూపెట్టాలి? ఆయన స్వయంగా శివపాద శేకరన్ అని పిలుచుకునేవారు. అలాంటప్పుడు ఆయన హిందూ కాదా?’ అని అడిగారు.

Also Read: ఆదిపురుష్ సినిమా డైరెక్టర్‌ కు మధ్యప్రదేశ్ హోం మంత్రి వార్నింగ్.. అవి తొలగించండి లేదంటే లీగల్ యాక్షన్

బీజేపీ నేత హెచ్ రాజా వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ కూడా స్పందించారు. వెట్రిమారన్‌కు మద్దతుగా నిలబడ్డారు. ‘రాజ రాజ చోళన్ పాలిస్తున్న కాలంలో హిందూ మతం అనే పేరే లేదు. అప్పుడు వైష్ణవం, శైవం, సమనం అనేవి ఉండేవి. హిందూ అనే పదాన్ని బ్రిటీషర్లు తొలుత పలికారు. తూతుకుడిని ఎలా పిలువాలో తెలియక వారే ట్యూటికోరిన్‌గా మార్చేశారు’ అని ఓ ప్రకటనలో వివరించారు.

8వ శతాబ్దంలో ఎన్నో మతాలు విలసిల్లేవి. ఆదిశంకరుడు శన్మాద స్తబనం స్థాపించాడు.

పొన్నియిన్ సెల్వన్ సినిమాను క్యాస్ట్‌, క్రూలతో కలిసి కమల్ హాసన్ వీక్షించారు. ఆ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్ర ఆధారంగా రూపొందిన కల్పిత కథను వేడుక చేసుకోవల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరించే లేదా భాష పరమైన సమస్యలను ఈ సినిమాలోకి లాగొద్దని కోరారు.

click me!