
Uttar Pradesh election result 2022: దేశంలో రాజకీయంగా అత్యం కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటిన బీజేపీ.. ప్రస్తుత ట్రెండ్ గమనిస్తే.. 263 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే అధిక సంఖ్యలో అధిక్యంలో సమాజ్ వాదీ పార్టీ కొనసాగతున్నప్పటికీ.. ఆ పార్టీ అంచనాలకు అందనంత దూరంలో నిలిచిపోయింది. దీంతో బీజేపీ రాష్ట్రంలో తిరుగులేని విధంగా మళ్లీ అధికారం ఏర్పాటు చేసే సంకేతాలు పంపింది.
అయితే, కాంగ్రెస్, బీఎస్పీలు మరింత దారుణ ఫలితాలను చవిచూశాయి. జనసత్తా దళ్ (లోక్తాంత్రిక్) పార్టీకి చెందిన రాజా భయ్యా అని కూడా పిలువబడే రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని కుంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన గుల్షన్ యాదవ్‌పై దాదాపు 27,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ ఈ స్థానం నుంచి సింధూజా మిశ్రాను బరిలోకి దింపింది. ఆయన యూపీ ఎన్నికల్లో వరుసగా ఏడు సార్లు కుంటా నియోజకవర్గం నుంచి గెలుపొందుతున్నారు.
రాజా భయ్యా ప్రయాణంలోని ఐదు అంశాలు ఇలా ఉన్నాయి..
1. రాజా భయ్యాకు మొత్తం 76,620 ఓట్లు రాగా, గుల్షన్ యాదవ్‌కు 49,867 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నియోజకవర్గం నుంచి రాజా భయ్యకు ఇది వరుసగా ఏడో విజయం.
2. 1993లో ఇండిపెండెంట్‌గా మొదటి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన అప్పటి నుంచి వరుసగా ఆరు ఎన్నికల్లో కుంట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాజా భయ్యా 2018లో సొంత పార్టీని స్థాపించారు. కుందా నియోజకవర్గంలో ఫిబ్రవరి 27న ఐదో దశలో ఎన్నికలు జరిగాయి.
3. 2017లో, రాజా భయ్యా బీజేపీకి చెందిన జాంకీ శరణ్‌ను బీజేపీ వేవ్ ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో 1,03,647 ఓట్ల తేడాతో ఓడించారు. ఎన్నికలకు ముందు, 2017 ప్రదర్శనను పునరావృతం చేస్తానని విశ్వాసం ఆయన వ్యక్తం చేశాడు.
4. 52 ఏళ్ల అతను గ్రాడ్యుయేట్ అయినప్పటికీ అతనిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. వివాదాస్పద నేత, రాజా భయ్యా యూపీలో కండలవీరుడుగా పేరుగాంచాడు. కళ్యాణ్ సింగ్, రాంప్రకాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్, ములాయం సింగ్ యాదవ్ మరియు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వాలలో ఆయన మంత్రిగా పనిచేశారు.
5. రాజా భయ్యా ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల ప్రకారం, అతని మొత్తం నికర విలువ ₹ 23.70 కోట్లుగా పేర్కొన్నాడు.