‘పతనం అక్కడే మొదలవుతుంది’.. అన్నయ్య ఉద్ధవ్ ఠాక్రేకు రాజ్ ఠాక్రే కౌంటర్!.. ఫ్యామిలీ ఫైట్?

Published : Jun 30, 2022, 03:42 PM IST
‘పతనం అక్కడే మొదలవుతుంది’.. అన్నయ్య ఉద్ధవ్ ఠాక్రేకు రాజ్ ఠాక్రే కౌంటర్!.. ఫ్యామిలీ ఫైట్?

సారాంశం

ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయనకు తమ్ముడైన నవనిర్మాణ్ సేన పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే సోషల్ మీడియాలో స్పందించారు. ఒకరకంగా ఉద్ధవ్ ఠాక్రేకు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. వారి పతనం అక్కడే మొదలవుతుందంటూ నర్మగర్భంగా కోట్ చేశారు.  

ముంబయి: శివసేనలో తిరుగుబాట్లు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇంతకంటే బీభత్సంగా తిరుగుబాట్లు జరిగాయి. అందులో రాజ్ ఠాక్రే తిరుగుబాటు కచ్చితంగా ఉంటుంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని తిరుగుబాటు కంటే కూడా రాజ్ ఠాక్రే ఎన్నో రెట్లు తీవ్రంగా పార్టీ నాయకత్వంపై దాడి చేశాడు. శివసేన పార్టీకి నాయకత్వం వహిస్తారని ఆశించి భంగపడ్డ రాజ్‌ ఠాక్రే.. ఉద్ధవ్ ఠాక్రే చాలా సార్లు విమర్శించారు. అయితే, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో రెబల్స్ తిరుగుబాటు లేవదీసినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్ ఠాక్రే రాష్ట్రంలోని పరిణామాలపై స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. తాజాగా, అంటే.. సీఎం పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రే తప్పుకున్న తర్వాత రాజ్ ఠాక్రే తనదైన పంచ్‌తో ట్విట్టర్‌లో ఓ కొటేషన్ పోస్టు చేశారు.

ఒక వ్యక్తి తన అదృష్టాన్ని తాను సాధించిన విజయంగా ఎప్పుడైతే భావిస్తారో.. అప్పటి నుంచి అతని పతనం మొదలవుతుంది అనే అర్థంలో రాజ్ ఠాక్రే ఒక కొటేషన్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

రాజ్ ఠాక్రే రెండు దశాబ్దాల క్రితం శివసేనలో తిరుగుబాటు చేశారు. అనంతరం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనను స్థాపించారు. అయితే, ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసి కొత్త ప్రభుత్వంలో భాగం అయ్యే అవకాశం ఉన్నది. అంటే.. బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని అధిరోహించనున్నది. కానీ, అప్పుడు రాజ్ ఠాక్రే వర్గం సొంతంగా పార్టీ అయితే స్థాపించారు గానీ, రాజకీయంగా చెప్పకోదగ్గ విజయాన్ని అందుకోలేకపోయారు.

ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే అన్నదమ్ముల పిల్లలు. శివసేనను స్థాపించిన బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే, బాలాసాహెబ్ తమ్ముడు శ్రీకాంత్ ఠాక్రే కొడుకే రాజ్ ఠాక్రే. బాల్ ఠాక్రే లాగే.. రాజ్ ఠాక్రే బలమైన ప్రకటనలు చేసేవారు. ఆకర్షణీయ ప్రసంగాలతో ఇట్టే ఆకట్టుకునేవాడు. కొన్ని రోజులైతే బాల్ ఠాక్రే రాజకీయ వారసుడు రాజ్ ఠాక్రేనే అని విశ్వసించేవారు. కానీ, ఆయన రాజకీయ వారసుడిగా ఉద్ధవ్ ఠాక్రేనే ఎన్నుకున్నారు. దీంతో రాజ్ ఠాక్రే తీవ్ర అసంతృప్తికి గురైనట్టు అప్పుడు చెప్పుకునేవారు. చివరకు 2005లో శివసేనలో తిరుగుబాటు లేవదీసి కొత్త పార్టీ పెట్టారు. కుటుంబ సారథ్యంలోని శివసేనను పూర్తిగా వదిలిపెట్టారు.

ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు జరిగిన ఈ వారం రోజుల కాలంలో రాజ్ ఠాక్రే పెద్దగా స్పందించలేదు. కానీ, ఉద్ధవ్ ఠాక్రే సీఎం సీటుకు రాజీనామా చేసిన తరుణంలో రాజ్ ఠాక్రే ఈ కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించే పెట్టారని చర్చించుకుంటున్నారు. ఆయన మొత్తంగా ఉద్ధవ్ ఠాక్రే అదృష్టం కొద్దీ బాల్ ఠాక్రే కుమారుడైనందునే పార్టీ పగ్గాలు పొందగలిగాడని అంతర్లీనమైన అర్థంలో ఈ ట్వీట్ పెట్టినట్టు కొందరు చర్చిస్తున్నారు. దీంతో రాజ్ ఠాక్రే ఫ్యామిలీ ఫైట్‌కు తెరతీశారా? అనే అనుమానాలు వస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?